మళ్లీ సంక్రాంతికి చూసుకుందాం.. సరిపోయారిద్దరు

మళ్లీ సంక్రాంతికి చూసుకుందాం.. సరిపోయారిద్దరు


సంక్రాంతికే తమ సినిమాలు తేవాలని నిర్మాతలు, హీరోలు ఫిక్సైతే ఓకే.. కానీ సంక్రాంతికే రావాలని ఆడియన్స్ కూడా ఫిక్సైతేనే ఇక్కడ అసలు సమస్య. ఇండస్ట్రీలో ఇదే జరుగుతుందేమో అనే భయం మొదలైంది మేకర్స్‌లో ఇప్పుడు..! సంక్రాంతికి బయటికొచ్చిన ఆడియన్స్.. మళ్లీ ఇప్పటి వరకు రాలేదు. దీనికి ఏంటర్థం..? ప్రేక్షకుల్ని రప్పించే సినిమాలే రావట్లేదా..? ఈ టాపిక్కే ఈరోజు మన ఎక్స్‌క్లూజివ్.. ఆడియన్స్ థియేటర్స్‌కు రావట్లేదు సర్.. ఈ మధ్య ఇండస్ట్రీలో కొందరు నిర్మాతలు చేస్తున్న కంప్లైంట్ ఇది. ఇందులో కొంత నిజం లేకపోలేదు. కానీ వాళ్లు వచ్చేలా.. రావాలనిపించేలా సినిమాలు తీయాల్సిన బాధ్యత కూడా దర్శక నిర్మాతలపైనే ఉంది. ఆ విషయంలో ఓన్లీ సంక్రాంతి సీజన్ మాత్రమే నిర్మాతలకు వర్కవుట్ అవుతుంది. మొన్న సంక్రాంతికి ఆడియన్స్ అంతా థియేటర్లకు క్యూ కట్టారు. ముఖ్యంగా మన శంకరవరప్రసాద్ గారు, అనగనగా ఒకరాజు, నారీనారి నడుమ మురారి సినిమాలను తెగ చూసారు ఫ్యామిలీ ఆడియన్స్. అవిప్పుడు ఓటిటిలోకి వచ్చేసాయి కూడా. కానీ ఇప్పటి వరకు బాక్సాఫీస్ దగ్గర మరో హిట్ రాలేదు.. సంక్రాంతి తర్వాత థియేటర్స్ అన్నీ మళ్లీ కళ తప్పాయి. గత నెల రోజుల్లో దాదాపు 20 సినిమాలు విడుదలయ్యాయి. అందులో ఓం శాంతి శాంతి, యుఫోరియా, ఫంకీ లాంటి క్రేజీ సినిమాలున్నాయి.. కానీ అవేవీ ఆడియన్స్‌ను ఏ మాత్రం మెప్పించలేకపోయాయి. రాబోయే 10 రోజుల్లో హే బల్వంత్, విష్ణు విన్యాసం లాంటి క్రేజీ మూవీస్ రానున్నాయి. వీటిలో ఎన్ని సినిమాలకు ఆడియన్స్ థియేటర్స్ వరకు వస్తారనేది ఆసక్తికరమే. మార్చి 19న టాక్సిక్, ధురంధర్ 2.. మార్చి 26న ఉస్తాద్ భగత్ సింగ్.. ఎప్రిల్ 3న నిహారిక నిర్మిస్తున్న రాకాస, శర్వానంద్ బైకర్.. ఎప్రిల్ 10న నిఖిల్ స్వయంభు.. ఎప్రిల్ 30న పెద్ది సినిమాలు రానున్నాయి. పవన్, చరణ్ లాంటి స్టార్స్ వస్తే గానీ ఆడియన్స్ థియేటర్స్ వరకు వచ్చేలా లేరు. ఈ లెక్కన సంక్రాంతికి బయటికొస్తే.. మళ్లీ సంక్రాంతి వరకు నిర్మాతలకు ఈ ఎదురుచూపులు తప్పవేమో..?

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Allu Arjun: అల్లు అర్జున్ అసాధ్యుడే.. ఆ ప్లానింగ్ ఏంటి బన్నీ

Vishnu Vinyasam: కామెడీతో విన్యాసాలు చేస్తున్న కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్మెంట్

Ram Charan: ఒకటి కాదు రెండు.. చరణ్‌కు లెక్కల మాస్టారు ట్విస్ట్

Keerthy Suresh: గ్యాప్ ఇవ్వలేదు.. తీసుకున్నా అంటున్న స్టార్ హీరోయిన్

బాలీవుడ్‌లో తనపై తీవ్ర వివక్ష !! కుండబద్దలుకొట్టిన రెజీనా



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *