మళ్లీ మొదటి కొచ్చిన యవ్వారం.. తప్పుల తడకగా డీఎస్సీ 2025 ఫైనల్‌ ఆన్సర్‌ కీ! రోడ్డెక్కిన నిరుద్యోగులు..

మళ్లీ మొదటి కొచ్చిన యవ్వారం.. తప్పుల తడకగా డీఎస్సీ 2025 ఫైనల్‌ ఆన్సర్‌ కీ! రోడ్డెక్కిన నిరుద్యోగులు..


అమరావతి, ఆగస్ట్‌ 8: ఆంధ్రప్రదేశ్‌ మెగా డీఎస్సీ 2025 ఆన్‌లైన్ పరీక్షలు జూన్‌ 6 నుంచి జులై 2వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో ఆన్‌లైన్ విధానంలో నిర్వహించిన సంగతి తెలిసిందే. అదే నెలలో అన్ని సబ్జెక్టులు ప్రాథమిక ఆన్సర్‌ కీలు కూడా విద్యాశాఖ విడుదల చేయగా.. వాటిపై అభ్యంతరాలను కూడా స్వీకరించింది. ఇటీవల ఈ పరీక్షలకు సంబంధించిన తుది ఆన్సర్‌ కీలు కూడా విడుదలయ్యాయి. పరీక్షల ఫలితాలు త్వరలో విడుదలకానున్ని సంగతి తెలిసిందే.

అయితే జూన్‌ 10న సెకండ్‌ షిఫ్గుతో నిర్వహించిన స్కూల్‌ అసిస్టెంట్‌ బయాలజీ పరీక్షకు సంబంధించి ప్రాథమిక కీలో తప్పులు దొర్లాయని అభ్యర్థులు వాపోతున్నారు. దీనిపై పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి మార్పులు చేయకుండానే తుది కీ విడుదల చేసినట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము అభ్యంతరాలు లేవనెత్తినా పట్టించుకోలేదనీ, మెరిట్‌ లిస్ట్‌లో మార్కులు కోల్పోవల్సి ఉంటుందని, తమ గోడు పట్టించుకునే నాథులే కానరావడంలేదనీ బాధపడుతున్నారు. నిజానికి ఈ పరీక్షకు సంబంధించి 14 నుంచి 16 ప్రశ్నల వరకు తప్పులు దొర్లినట్లు అభ్యర్ధులు చెబుతున్నారు. ఫిష్ట్‌ 2 పరీక్షలో రాష్ట్ర వ్యాప్తంగా 9వేల మంది పరీక్ష రాశారు. అయితే తుది కీలో అభ్యంతరాలను సరిగా పరిశీలించకుండానే.. అవే తప్పులతో ఫైనల్‌ కీ ఎలా రూపొందిస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల తామంతా నష్టపోతున్నామని వాపోతున్నారు. దీనిపై మంగళగిరిలోని విద్యాభవన్‌కు చేరుకున్న పలువురు అభ్యర్థులు డీఎస్సీ కన్వీనర్‌ కృష్ణారెడ్డిని కలిశారు. తప్పులతో కూడిన సమాధానాలు ఉన్న సదరు ప్రశ్నలకు తగిన ఆధారాలతో వివరణ ఇచ్చినట్లు తెలిపారు. ఇప్పటికే స్పందించి తమకు న్యాయం చేయాలని వారంతా డిమాండ్‌ చేశారు. దీనిపై డీఎస్సీ కన్వీనర్‌ ఏ విధంగా స్పందిస్తారనేది వేచి చూడాలి.

కాగా డీఎస్సీ తుది ఆన్సర్‌ వచ్చిన వారం రోజుల్లోగా పలితాలు వెల్లడిస్తామని గతంలో అధికారులు తెలిపారు. నోటిఫికేషన్‌లోనూ ఇదే విషయాన్ని అధికారులు స్పష్టం చేశారు. ఆ ప్రకారంగా చూస్తే ఆగస్టు మొదటి వారంలో తుది కీలు విడుదలయ్యాయి. ఈ వారంలోనే ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఇంత తక్కువ టైంలో ఆన్సర్‌కీలో మార్పులు చేస్తారా? లేదా? అనేది ఉత్కంఠగా మారింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *