మయసభ రివ్యూ.. పొలిటిక‌ల్ డ్రామా ఎలా ఉందంటే?

మయసభ  రివ్యూ.. పొలిటిక‌ల్ డ్రామా ఎలా ఉందంటే?


తాజాగా ఈ సిరీస్ స్ట్రీమ్ అవుతోంది. మరి ఈ సిరీస్‌ ఎలా ఉంది.? రాజకీయంగా ఏదైనా సంచలనాలు క్రియేట్ చేయబోతుందా? లేదా నయా కాంట్రవర్సీగా మారుతుందా? అనేది పూర్తి రివ్యూలో చూద్దాం.. కృష్ణమనాయుడు అలియాస్ ఆది పినిశెట్టి, ఎమ్మెస్ రామిరెడ్డి అలియాస్ చైతన్య రావు ఇద్దరూ మంచి స్నేహితులు. ఎమ్మెస్సార్ ఫ్యాక్షన్ ఫ్యామిలీ నుంచి వచ్చినా కూడా.. వైద్యుడిగా స్థిరపడతాడు. మరోవైపు నాయుడు మాత్రం చిన్నప్పటి నుంచి రాజకీయాల్లోకి రావాలి.. జనానికి ఏదో ఒకటి చేయాలి అనే కాంక్షతో ఉంటాడు. కాలేజ్ లైఫ్‌తో నాయుడు, రెడ్డి కలుస్తారు. ప్రాణ స్నేహితులుగా మారతారు. విధి కూడా ఈ ఇద్దరినీ ఒకే పార్టీలో చేరేలా చేస్తుంది.. ఇద్దరూ చాలా చిన్న వయసులోనే ఎమ్మెల్యేలు, మంత్రులు అవుతారు.. ఆ తర్వాత నాయుడు మామ, తెలుగు తెర ఇలవేల్పు అయిన అగ్ర నటుడు RCR అలియాస్ సాయి కుమార్ రాజకీయ పార్టీ పెట్టడంతో అక్కడికి వెళ్లిపోతాడు. అలా అప్పటి వరకు ఒకే పార్టీలో ఉన్న నాయుడు, రెడ్డి రాజకీయంగా విరోధులు అవుతారు. ఆ తర్వాత ఏం జరిగింది. వీరిద్దరి కథ ఎటు వెళ్లింది.. అనేది కథ.. ప్రస్థానం, రిపబ్లిక్ లాంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు దేవా కట్ట! సినిమాలు ఫాలో అయ్యే వాళ్లకు ఈయన గురించి చెప్పనక్కర్లేదు. దేవా కట్టా అనే పేరు చూసి సినిమాకు వెళ్లే వాళ్లు కూడా ఉన్నారు. తక్కువ సినిమాలే చేసినా కానీ వచ్చిన గుర్తింపు మాత్రం ఎక్కువే. ప్రస్థానంతో రాజకీయ నేపథ్యం ఉన్న సినిమాలకు ఈయనే కేరాఫ్‌గా మారిపోయాడు. ఈరోజుకు కూడా తెలుగులో బెస్ట్ పొలిటికల్ థ్రిల్లర్ ఏది అంటే మరొక ఆలోచన లేకుండా ప్రస్థానం అంటారు. దేవ కట్ట ఆలోచన శైలి ఎలా ఉందో ఈ సినిమా చూస్తే అర్థమయిపోతుంది. అంత అద్భుతమైన సినిమా తీసిన ఈయన.. ఆ తర్వాత పొలిటికల్ సినిమాలకు దూరం అయిపోయాడు. ఇలాంటి సమయంలో సినిమాలు కాదని మయసభ అనే వెబ్ సిరీస్ చేసాడు. రాష్ట్ర కేంద్ర రాజకీయాలను మలుపు తిప్పిన ఎన్నో సంఘటనలను ఆధారంగా చేసుకొని ఈ సిరీస్ రూపొందించాడు దేవా కట్ట.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ప్రేమతో కూతురును చూడ్డానికి వెళితే.. మెడలో ఉన్నది కాస్తా కొట్టేశారు

చిన్నారి చేతిరాత బాగోలేదని.. ట్యూషన్ టీచర్ దారుణం..

పడగ విప్పిన పాముతో డాన్స్ ఏంట్రా అయ్యా.. ఆలా చేస్తే ఇలానే అవుతుంది మరి

ముచ్చటగా 8 పెళ్లిళ్లు.. తొమ్మిదో పెళ్లికి సిద్ధమైన మహిళకు ఊహించని షాక్‌

30 ఏళ్లనాటి పిండం.. ఇప్పుడు శిశువుగా జననం



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *