ఫిరానా చేపల జాతికి చెందిన ఈ చేపలతో మహా జాగ్రత్తగా ఉండాలంటున్నారు.. నిపుణులు. ఇక రూప్ చంద్ చేపల విషయానికి వస్తే.. ఇవి ఎక్కువగా మాంసాహారాన్ని ఇష్టపడతాయి. ఇవి పిరానా జాతికి చెందినవి. ఈ రకం చేపలు గోదావరి జిల్లాల నుంచి ఎక్కువగా బెంగాల్‌కు ఎగుమతి అవుతున్నాయి. బెంగాలీలు వీటిని ఇష్టంగా తింటారు. ప్రోటీన్ ఎక్కువగానూ.. కొవ్వు తక్కువగానూ ఉండటంతో.. వీటిని బరువు తగ్గాలనుకునేవారు ఆహారంగా తీసుకుంటారు. ఈ చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా ఉండటంతో గుండె ఆరోగ్యానికి ఇది మేలు చేస్తుంది. ఇవి కేజీ నుంచి 3 కేజీల బరువు వరకు పెరుగుతాయి.ఈ చేపలు కొన్ని ఎరుపు, తెలుపు నలుపు సిల్వర్ రంగులలో ఉంటాయి. ఇది చెరువులోనూ నదులలోను పెరుగుతాయి. సిల్వర్ రంగు చేపలు ఉప్పునీటిలో సైతం పెరుగుతాయి. ఎకరం చెరువులో సుమారు 4 వేల నుంచి 5 వల వరకు రూప్ చంద్ చేప పిల్లలను పెంచుతారు. ఎకరానికి నాలుగు టన్నులపైనే దిగుబడి వస్తుంది.తర్వాత వీటిని ఎగుమతి చేస్తారు. తమ బలమైన దంతాలతో మనుషుల చేతులు, కాళ్లను తీవ్రంగా గాయపరిచే ప్రమాదం ఉండటంతో వీటిని పట్టుకునే సమయంలో చెరువుల్లో దిగే కూలీలు చాలా జాగ్రత్తగా ఉంటారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కొలను తవ్వుతుండగా అద్భుతం.. షాకైన గ్రామస్తులు..!
శ్రావణమాసంలో అద్భుతం..! శివుడి మెడలో నాగుపాము
3 కళ్లజోడు గుర్తులతో అరుదైన నాగుపామును చూశారా?
Saudi Arabia: సౌదీలో ఆ పని చేస్తే.. ఉరిశిక్షే..!
తేరగా దొరికిందని రూ. 40 కోట్ల భూమిపై కన్నేశారు.. కట్ చేస్తే