సాధాణంగా చాలా మందికి చదువుకోవాలనే కోరిక ఉంటుంది. కానీ ఆర్థిక ఇబ్బందులతో చదువును మధ్యలోనే ఆపేసిన వారు ఉన్నారు. ఆ తర్వాత సినీరంగంలోకి అడుగుపెట్టి గుర్తింపు తెచ్చుకున్నవారు ఉన్నారు. హీరోయిన్ సమంత సైతం ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఉన్నత చదువులు మధ్యలోనే ఆపేసినట్లు ఇదివరకు చెప్పుకొచ్చింది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న నటుడు సైతం.. ఇండస్ట్రీలో ఫేమస్ యాక్టర్. కానీ చదువుపై ఉన్న ఇష్టంతో 58 ఏళ్ల వయసులో మూడు డిగ్రీలు సాధించాడు. ఇంతకీ అతడు ఎవరో తెలుసుకుందామా. ?
ఇవి కూడా చదవండి.. OTT Movie: బాబోయ్.. ఓటీటీలో సంచలనం సృష్టిస్తోన్న థ్రిల్లర్ సినిమాలు.. ఊహకు అందని ట్విస్టులు..
తమిళ చిత్రపరిశ్రమలో పాపులర్ యాక్టర్ ముతుక్కలై.. ప్రస్తుతం ఆయన వయసు 58 సంవత్సరాలు. ఇప్పుడు ఆయన మూడు డిగ్రీలు సాధించారు. విరుధునగర్ జిల్లా రాజపాళయంకు చెందిన నటుడు ముతుక్కలై, సినిమా పట్ల మక్కువతో చిన్న వయసులోనే చెన్నైకి వచ్చారు. ఆ సమయంలో, ఆయన కరాటేను నేర్చుకున్నారు. 18 సంవత్సరాల వయస్సులో కరాటేలో బ్లాక్ బెల్ట్ సంపాదించాడు. ఆ తర్వాత చిత్ర పరిశ్రమలో స్టంట్ మాస్టర్‌గా పనిచేయడం ప్రారంభించాడు. దీంతో అతను తన చదువును కొనసాగించలేకపోయాడు. సినిమాల్లో కామెడీ పాత్రలతో మరింత పాపులర్ అయ్యాడు. కొన్నాళ్లకే అతడు మద్యానికి బానిసయ్యాడు.
ఇవి కూడా చదవండి
ఇవి కూడా చదవండి.. ఒక్క యాడ్‌తో ఫేమస్ అయ్యింది.. హీరోయిన్లకు మించిన క్రేజ్.. ఈ అమ్మడు ఇప్పుడేలా ఉందో తెలుసా.. ?

Muthukaalai
ఆ తర్వాత కోలుకుని చదువుపై దృష్టి పెట్టాడు.. తమిళనాడు ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ చదవడం ప్రారంభించాడు. 58 సంవత్సరాల వయస్సులో తమిళ సాహిత్యంలో ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీని సాధించాడు. అతను ఇప్పటికే 2017లో చరిత్రలో బ్యాచిలర్ డిగ్రీని, 2019లో తమిళనాడు ఓపెన్ యూనివర్సిటీ నుండి తమిళంలో మాస్టర్స్ డిగ్రీని పొందాడు.
ఇవి కూడా చదవండి.. Megastar Chiranjeevi: చిరంజీవికి ప్రియురాలిగా, భార్యగా, తల్లిగా, చెల్లిగా నటించిన హీరోయిన్..