మద్యం మత్తులో డ్రైవింగ్.. కారుతో ఏకంగా 30 మందిని ఢీకొట్టిన ఆర్మీ అధికారి.. స్థానికులు ఏం చేశారో తెలిస్తే!

మద్యం మత్తులో డ్రైవింగ్.. కారుతో ఏకంగా 30 మందిని ఢీకొట్టిన ఆర్మీ అధికారి.. స్థానికులు ఏం చేశారో తెలిస్తే!


మద్యం మత్తులో కారు నడిపిన ఒక ఆర్మీ అధికారి నియంత్రణ కోల్పోయి రోడ్డుపై వెళ్తున్న దాదాపు 30 మందిని ఢీకొట్టిన తర్వాత కారు కాల్వలో పడిపోయిన ఘటన మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌లో వెలుగుచూసింది. కాలువ నుంచి అతన్ని బయటకు తీసిన స్థానికులు చితకబాది పోలీసులకు అప్పగించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హర్ష్‌పాల్‌ మహదేవ్‌ అనే ఆర్మీ అధికారి ఆదివారం రాత్రి మద్యం సేవించిన తర్వాత ఇంటికి వెళ్లేందుకు దుర్గాచౌక్ మీదుగా హమ్లాపురికి కారులో స్టార్ట్‌ అయ్యాడు. అయితే అతను మద్యం సేవించి ఉండడంతో మార్గమధ్యలోకి రాగనే నియంత్రణ కోల్పోయి రోడ్డుపై వెళ్తున్న జనాలను ఢీకొట్టి, తర్వాత పక్కనే ఉన్న కాలువలో పడిపోయాడు. ఈ ప్రమాదంలో దాదాపు 30 మంది వరకు స్థానికులు గాయపడ్డారు.

ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే అక్కడికి చేరుకొని కాలువలో పడిపోయిన మహదేవ్‌ను బయటకు తీశారు. మద్యం సేవించి నిర్లక్ష్యంగా కారు నడిపిడి జనాలను గాయపరిచినందుకు వారు అతన్ని చితకబాదారు. స్థానికుల దాడిలో ఆర్మి అధికారి తీవ్రంగా పడ్డాడు. తర్వాత వారి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. ఇంతలో సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆర్మీ అధికారి మహదేవ్‌ను అదుపులోకి తీసుకున్నారు.

తర్వాత మహాదేవ్‌తో పాటు ప్రమాదంలో గాయపడిన వారికి సైతం పోలీసులు చికిత్స నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. అయితే ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని పోలీసులు తెలిపారు. అయితే ప్రమాదానికి కారణమైన మహాదేవ్‌ ప్రస్తుతం అస్సాంలోని సైన్యంలో విధులు నిర్వహిస్తున్నాడని.. నాలుగు రోజుల సెలవుల్లో భాగంగా ఇటీవలే స్వగ్రామానికి వచ్చినట్టు పోలీసులు తెలిపారు. అయితే ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రమాదంపై కేసు నమెదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *