మద్యం మత్తులో ఓవరాక్షన్‌ చేసిన కానిస్టేబుల్‌కి తగిన శాస్తి

మద్యం మత్తులో ఓవరాక్షన్‌ చేసిన కానిస్టేబుల్‌కి తగిన శాస్తి


రక్షించాల్సినవారే కర్కశులుగా మారితే చట్టం చూస్తూ ఊరుకోదని రామగుండం పోలీస్ కమిషనర్ మరోసారి నిరూపించారు. మద్యం మత్తులో తన భార్యపై, పసిబిడ్డపై అమానుషంగా దాడి చేసిన కానిస్టేబుల్ రవిప్రసాద్‌పై వేటు పడింది. ఈ ఘటనకు సంబంధించి రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు. మంచిర్యాల పట్టణంలోని రెడ్డి కాలనీలో నివసించే కానిస్టేబుల్ రవిప్రసాద్, గత ఆదివారం అర్ధరాత్రి మద్యం మత్తులో తన భార్యపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ దాడిలో వారి చిన్నారి బిడ్డ కూడా గాయపడింది. శిరీష ప్రస్తుతం గుడిపేట బెటాలియన్‌లో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. ఆరేళ్ల క్రితం వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నప్పటికీ, రవిప్రసాద్ తరచూ ఆమెను వేధింపులకు గురిచేస్తున్నట్లు సమాచారం. బాధితురాలు, ఆమె కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మంచిర్యాల పట్టణ పోలీసులు రవిప్రసాద్‌పై కఠిన చర్యలు చేపట్టారు. అతనిపై BNS సెక్షన్లు 115, 351(2) తో పాటు, ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేశారు. క్రమశిక్షణారాహిత్యానికి పాల్పడిన రవిప్రసాద్‌ను సర్వీస్ నుండి సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పుణ్య దంపతులు.. మరణంలోనూ తోడుగా..

గోల్డ్ బాండ్ ఇన్వెస్టర్లకు షాక్.. ఏప్రిల్ 1 నుంచి మారనున్న రూల్స్ !!

అది పులి కాదురా బాబూ.. పిల్లి రా అయ్యా..

శ్వేతవర్ణంలో మెరిసిపోతున్న కాశ్మీర్‌.. ఒక్క సారి నా కళ్ళతో చూడు మావా

Sweet Potato: చిలగడదుంపతో ఎన్ని ప్రయోజనాలో తెలిస్తే అస్సలు వదలరు



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *