అందాల ముద్దుగుమ్మ నటి మౌనీ రాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పా్ల్సిన పని లేదు. అందం, అభినయం ఈ బ్యూటీ సొంతం. హిందీ బుల్లితెరపైకి నాగిన్ సీరియల్‌తో ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు అందులో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక తెలుగులో కూడా నాగిని సీరియల్‌తో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైంది. ఈ సీరియల్లో ఈ అమ్మడు నటకే కాదు, అందానికి కూడా ప్రతి ఒక్కరూ ఫిదా అయిపోయారు. దీంతో ఈ ముద్దుగుమ్మకు విపరీతమైన క్రేజ్ వచ్చింది.
యూత్ ఎవరి నోట విన్నా ఈ బ్యూటీ పేరే వినిపించింది. అలా తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఈ అమ్మడు, తర్వాత సిల్వర్ స్క్రీన్ పైకి ఎంట్రీ ఇచ్చింది. చాలా సినిమాల్లో నటించింది. ముఖ్యంగా ఆలియా, రణ్ బీర్ కపూర్ హీరో, హీరోయిన్లుగా చేసిన, బ్రహ్మాస్త్రం సినిమాలో కీలక పాత్రలో కనిపించి తన నటతో అందరి చేత ప్రశంసలు అందుకుంది.
ఇక ఈ మూవీ తర్వాత ఈ బ్యూటీ చాలా సినిమాల్లో అవకాశాలు అందుకుంటూ , తన సత్తా చాటుతుంది. సినిమాల్లో కీలక పాత్రల్లో నటించడమే కాకుండా , స్పెషల్ సాంగ్స్‌ల్లో కూడా చిందులేస్తూ వావ్ అనిపిస్తుంది. మౌనీ రాయ్ ఇప్పటి వరకు బాలీవుడ్ సినిమాల్లో మాత్రమే నటించింది. అయితే ఈ బ్యూటీ త్వరలో మెగాస్టార్ చిరంజీవి సినిమాతో తెలుగు అభిమానుల ముందుకు రానున్నది.
ఈ అమ్మడు చిరు విశ్వంభర మూవీలో స్పెషల్ సాంగ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ చిన్నది. ఎప్పుడూ తన హాట్ అండ్ క్యూట్ ఫొటోస్‌తో కుర్రకారును ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ చిన్నది పింక్ చీరలో తన అందాలతో మాయ చేస్తుంది.
తాజాగా సన్నటి లేత గులాబీ రంగు చీరలో, అదరిపోయే స్టిల్స్ ఇచ్చింది. ఇందులో ఈ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే అంతలా, తన గ్లామర్‌తో ఆకట్టుకుంటుంది. మరి మీరు కూడా ఆఫొటోస్ పై ఓలుక్ వేయండి.