యాలకులు అనేవి చిన్న గింజల లాంటి ఆహార పదార్థమే అయినా.. ఆరోగ్యానికి మాత్రం గొప్ప వరం. సువాసనతో మనసును ఆకట్టుకునే యాలకులు, ఆయుర్వేదంలో ప్రాచీనకాలం నుంచే ఔషధంగా ఉపయోగించబడుతున్నాయి. జీర్ణక్రియను మెరుగుపరచడం నుంచి నోటి ఆరోగ్యం, హృదయ సంరక్షణ వరకు అనేక ప్రయోజనాలు వీటిలో దాగి ఉన్నాయి. రోజువారీ ఆహారంలో కొద్దిగా యాలకులు చేర్చుకుంటే, శరీరానికి సహజమైన బలం, ఉత్సాహం లభిస్తుంది. కానీ, భోజనం తర్వాత యాలకులు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో చాలా మందికి మీకు తెలియకపోవచ్చు? భోజనం తర్వాత యాలకులు తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి.