భారత్‌ మార్కెట్‌లోకి KTM నుంచి మరో సరికొత్త బైక్‌.. లాంచింగ్‌ ఎప్పుడంటే!

భారత్‌ మార్కెట్‌లోకి KTM నుంచి మరో సరికొత్త బైక్‌.. లాంచింగ్‌ ఎప్పుడంటే!


KTM ఇండియా మార్కెట్‌లోకి మరో సరికొత్త 160 డ్యూక్ మోడల్‌ బైక్‌ను తీసుకురానున్నట్టు తెలుస్తోంది. అకోడ్రైవ్ నివేదిక ప్రకారం.. కేటీఎమ్‌ తయారీ సంస్థ ఆగస్టు 2025లో భారత మార్కెట్లో నేకెడ్ స్పోర్ట్‌తో పాటు RC 160ని కూడా విడుదల చేయాలని చూస్తోంది. అయితే ఈ బైక్‌ను ముందుగా 2026లో లాంచ్ చేయాలని కేటీఎమ్ భావించింది. కానీ సూపర్‌స్పోర్ట్ డిజైన్‌తో బైక్‌ను ముందుగానే వినియోగదారులకు పరిచయం చేయాలనే నిర్ణయించుకున్నట్టు అక్రోడైవ్‌ నివేదిక ద్వారా తెలుస్తోంది.

అయితే భారత మార్కెట్లో ఇప్పటికే KTM RC 200, RC 390 లు ఉన్నప్పటికీ, ఇంతకంటే తక్కువ మోడల్‌ బైక్స్‌ అందుబాటులో లేవు. గతంలో 125 డ్యూక్‌ను తీసుకొచ్చినా అది పెద్దగా సక్సెస్‌ కాలేక పోయింది.  స్పోర్ట్స్‌ లుక్‌ రేసింగ్‌ మోడల్‌లో ప్రస్తుతం మార్కెట్‌ ఉన్న బైక్‌ యమహా R15 V4. ఇప్పుడు కేటీఎమ్‌ ఈ RC 160ని తీసుకొస్తే ఇది వీ4కు దీటుగా మార్కెట్‌లో నిలుస్తుంది. ఈ కేటీఎమ్‌ కొత్త మోడల్‌ కూడా RC 200, RC 390 తరహా డిజైన్‌లోనే అందుబాటులోకి రానున్నట్టు తెలుస్తోంది. తక్కువ సీసీతో ఈ మోడల్‌ అందుబాటులోకి వస్తే దీన్ని కొనేందుకు వినియోగదారులు ఎక్కువగా మొగ్గు చూపుతారని కేటీఎమ్ ఆలోచిస్తోంది.

అయితే ఈ RC 160 కి ముందు కేటీఎమ్ RC సిరీస్‌లో ఎంట్రీ-లెవల్ మోడల్ RC 125ను తీసుకొచ్చింది. కాని ఇది పెద్దగా సక్సెక్‌ కాలేక పోయింది. దీంతో వీటి అమ్మకాలు కూడా భారీగా తగ్గిపోవడంతో కేటీఎమ్‌ దశలవారీగా ఈ మోడల్‌ను నిలిపివేసింది. కొత్తగా తీసుకొచ్చే బైక్స్‌ మార్కెట్‌లో సక్సెస్‌ అవుతాయా లేదా అనేది దాని ధరపై ఆధారపడి ఉంటుంది. అందువల్ల, ఈ కొత్త మోడల్ ప్రైజ్‌ కొనుగోలుదారులను ఆకర్షించేలా ఉండేలా కేటీఎమ్‌ సరైన ఎంపికలు చేసుకోవాలి. ఈ బైక్‌ మార్కెట్‌లోకి వస్తే RC వేరెంట్‌లో భారత్‌లో అత్యంత సరసమైన ధరకు వచ్చే మోడల్ ఇదే అవుతుంది.

అయితే ఈ KTM RC 160 బైక్‌ ఫీచర్స్‌ అయితే ఇంతవరకు బయటకు రాలేదు. కాని ఇది 160 cc సింగిల్-సిలిండర్ లిక్విడ్-కూల్డ్ ఇంజిన్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. సాధారణంగా ఈ తరహా ఇంజిన్ దాదాపు 20 hp శక్తిని ఉత్పత్తి చేస్తుంది. 160cc ఇంజిన్ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడే అవకాశం ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *