Headlines

భారతీయ రైల్వేలో పెను మార్పు.. ఇకపై LNGతో రైళ్ల ప్రయాణం

భారతీయ రైల్వేలో పెను మార్పు.. ఇకపై LNGతో రైళ్ల ప్రయాణం


పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా భారతీయ రైల్వే మరో చారిత్రాత్మక మైలురాయిని అధిగమించింది. డీజిల్ వినియోగాన్ని తగ్గించి, కాలుష్య రహిత ప్రయాణాన్ని అందించే దిశగా లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (LNG), డీజిల్ మిశ్రమ ఇంధనంతో నడిచే డెమూ (DEMU) రైళ్లను అహ్మదాబాద్ రైల్వే విభాగం విజయవంతంగా ప్రవేశపెట్టింది. దేశంలోనే ఈ తరహా సాంకేతికతతో నడుస్తున్న మొదటి రైలు ఇదే కావడం విశేషం. ఈ వినూత్న ప్రాజెక్టులో భాగంగా 1400 హెచ్‌పీ సామర్థ్యం కలిగిన డెమూ రైలును ‘డ్యూయల్ ఫ్యూయల్’ వ్యవస్థకు మార్చారు. దీనివల్ల రైలుకు అవసరమైన మొత్తం ఇంధనంలో 40 శాతం డీజిల్‌ను ఆదా చేసి, ఆ స్థానంలో పర్యావరణహిత ఎల్‌ఎన్‌జీని వినియోగిస్తారు. సుమారు 2 వేల కిలోమీటర్ల మేర నిర్వహించిన ట్రయల్ రన్స్ విజయవంతం కావడంతో, ప్రస్తుతం ఇవి ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చాయి. డీజిల్ వాడకం తగ్గడం వల్ల కార్బన్ ఉద్గారాలు తగ్గి పర్యావరణానికి మేలు జరుగుతుంది.విదేశాల నుంచి దిగుమతి చేసుకునే డీజిల్ భారం తగ్గి, నిర్వహణ వ్యయం గణనీయంగా తగ్గుతుంది. ఈ సాంకేతిక మార్పులు భారతీయ రైల్వే ఇంజనీరింగ్ నైపుణ్యానికి నిదర్శనంగా నిలుస్తాయి. భవిష్యత్తులో మరిన్ని రైళ్లను ఈ విధానంలోకి మార్చడం ద్వారా రైల్వే రంగాన్ని పూర్తి పర్యావరణ అనుకూల శక్తిగా తీర్చిదిద్దేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నడిరోడ్డుపై షాకింగ్‌ సీన్.. ఆవు తో మందు బాబు చేసిన పనికి అందరికీ మైండ్ బ్లాక్

బిడ్డకు పాలిస్తున్న తల్లి.. క్షణాల్లో..

ఏపీ సహా 4 రాష్ట్రాల్లో రేర్ ఎర్త్ మినరల్స్ కోసం పథకం

ఆలయంలో నాగుపాము.. భక్తుల్లో భయం

విద్యార్థులకు బిగ్ రిలీఫ్.. స్కూల్‌లోనే అంతా..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *