ప్రపంచవ్యాప్తంగా ప్రజలు భారతీయ సంస్కృతి, నాగరికతను అభినందిస్తున్నారు. భారతీయుల జీవన విధానంలో సరళత, దుస్తుల శైలితో పాటు ఆహారాన్ని చాలా ఇష్టపడుతున్నారు. పెద్దలను గౌరవించడం, యోగా వంటివి ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. భారతీయుల అలవాట్లు భావోద్వేగపరంగా అనుసంధానించబడి ఉండటమే కాదు మన జీవనశైలి, క్రమశిక్షణకు ముఖ్యమైనవిగా కూడా పరిగణించబడుతున్నాయి. నేడు ప్రపంచం మొత్తం వాటిని అవలంబిస్తోంది. ముఖ్యంగా మన అలవాట్లను జపాన్ దేశ ప్రజలు ఎంతో ఇష్టంగా అనుసరిస్తున్నారు. వాస్తవంగా భారతదేశం, జపాన్ దేశాలు వాటి సొంత సంప్రదాయాలను కలిగి ఉన్నాయి. అయితే అవి అనుసంధానం కలిగి ఉన్నాయి. జపాన్ ప్రజలు కూడా స్వీకరించిన భారతీయుల అలవాట్లు కొన్ని ఉన్నాయి. రెండు దేశాలలో చాలా సాధారణమైన కొన్ని అలవాట్ల గురించి తెలుసుకుందాం.
నేలపై తినడం
నేలపై కూర్చుని తినడం ఆరోగ్యానికి మేలు చేస్తుందని భావిస్తారు. ఇది ఆహారం త్వరగా జీర్ణం కావడానికి సహాయపడుతుంది. జపాన్‌లో కూడా ప్రజలు నేలపై కూర్చుని తింటారు. ఆహార పదార్దాలను ఒక చిన్న టేబుల్ మీద పెడతారు. దాని దగ్గర గా చాప మీద కూర్చుంటారు. వీరు తినే ఈ అలవాటు భారతీయ శైలికి సరిపోతుంది.
పెద్దల పట్ల గౌరవం, వినయంతో ఉండడం
భారతదేశంలో పెద్దలకు నమస్కరించడం, పెద్దల పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకోవడం, పెద్దలతో గౌరవంగా మాట్లాడటం అనే సంప్రదాయం ఉంది. జపనీస్ సంస్కృతిలో కూడా ఇది ప్రతిబింబిస్తుంది. అక్కడ, తల వంచి పెద్దల పట్ల కృతజ్ఞతను ప్రదర్శిస్తారు. ఇది వినయపూర్వకమైన స్వభావాన్ని, ఇతరుల పట్ల గౌరవాన్ని చూపుతుంది. రెండు దేశాలలో గౌరవం అత్యంత ముఖ్యమైన ధర్మంగా పరిగణించబడుతుంది.
ఇవి కూడా చదవండి
యోగా, ధ్యానం
జీవనశైలిలో యోగా, ధ్యానం ఒక ముఖ్యమైన భాగం. జపాన్‌లో ధ్యానాన్ని జాజెన్ అంటారు. ఇది ఒకే చోట కూర్చుని ధ్యానం చేసే పద్ధతి. జపాన్ ప్రజలు ధ్యానం, యోగాను క్రమం తప్పకుండా అభ్యసిస్తారు. మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఏకాగ్రతను పెంచడానికి, మొత్తం ఆరోగ్యానికి యోగా ధ్యానం ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది.
భోజనానికి ముందు అలవాట్లు
భారతదేశంలో తినడానికి ముందు ప్రార్థన చేస్తారు. అదే విధంగా తిన్న తర్వాత ధన్యవాదాలు తెలుపుతారు. అదేవిధంగా జపాన్‌లో భోజనం ప్రారంభించే ముందు ‘ఇతదకిమాసు’ అని తిన్న తర్వాత ‘గోచిసోసమ దేశిత’ అని చెబుతారు. ఇలా తాము తిన్న ఆహారం పట్ల కృతజ్ఞతను చూపిస్తారు.
సరళ జీవితం
జపనీయుల జీవనశైలి, ఆహారం కూడా సరళతతో నిండి ఉన్నాయి. ఉదయాన్నే నిద్రలేవడం, ప్రకృతిని గౌరవించడం, ఇంటి బయట బూట్లు, చెప్పులు తీయడం.. ఇంట్లో చెప్పులు లేకుండా నడవడం వంటి అనేక ఇతర అలవాట్లు కూడా జపనీయులకు ఉన్నాయి. అయితే నేడు బిజీ షెడ్యూల్స్ , అనేక ఇతర కారణాల వల్ల రెండు దేశాలలోని కొంతమంది జీవనశైలిలో మార్పులు కనిపిస్తున్నాయి.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)