Headlines

భర్తతో మనస్పర్థలు.. సీనియర్ హీరోయిన్ విడాకులు.. షాక్ లో ఫ్యాన్స్

భర్తతో మనస్పర్థలు.. సీనియర్ హీరోయిన్ విడాకులు.. షాక్ లో ఫ్యాన్స్


రీసెంట్ డేస్‌లో పెళ్లి వార్తలు ఎంతగా వినిపిస్తున్నాయి విడాకుల వార్తలు కూడా అంతే వినిపిస్తున్నాయి. ముఖ్యంగా సినీ సెలబ్రెటీలు ఎక్కువగా విడాకుల బాటలు పడుతున్నారు. ఎవరు ఎప్పుడు విడిపోతారో తెలియడం లేదు. ఇండస్ట్రీలో ఈ ఆమధ్య విడాకుల వార్తలు కాస్త గట్టిగానే వినిపిస్తున్నాయి. స్టార్ హీరోల నుంచి దర్శకుల వరకు చాలా మంది విడాకులు తీసుకుంటూ ప్రేక్షకులకు షాక్ ఇస్తున్నారు. సమంత, నాగ చైతన్య దగ్గర నుంచి ఏఆర్ రెహమాన్ వరకు విడాకులు అనౌన్స్ చేసి అందరికి షాక్ ఇచ్చారు. పెళ్ళైన కొత్త జంటలే కాదు.. సీనియర్ హీరోలు, హీరోయిన్స్ కూడా విడిపోతున్నారు. పెళ్లై 18, 20ఏళ్లు అయిన జంట కూడా విడిపోతున్నారు. తాజాగా ఓ సీనియర్ హీరోయిన్ కూడా భర్త నుంచి విడిడిపోతుందని తెలుస్తుంది.

ఇది కూడా చదవండి :ఇదెక్కడి మేకోవర్ మావ..! అల్లుఅర్జున్ వరుడు హీరోయిన్ గుర్తుందా.? ఇప్పుడు సినిమాలు మానేసి

ఇండస్ట్రీలో ఎంతో మంది సీనియర్ హీరోయిన్స్ సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి రాణిస్తున్నారు. ఒకప్పుడు హీరోయిన్స్ గా రాణించి ఇప్పుడు సహాయక పాత్రల్లో నటిస్తున్న వారిలో సంగీత ఒకరు. తమిళనాడు లోని చెన్నై ప్రాంతానికి చెందిన సంగీత 1997లోనే సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. మలయాళం, కన్నడ, తమిళ భాషల్లో కొన్ని సినిమాలు చేసింది. తెలుగులోనూ చేసినా పెద్దగా గుర్తింపు రాలేదు. 2002లో కృష్ణవంశీ తెరకెక్కించిన ఖడ్గం సినిమా సంగీత కెరీర్ కు మంచి బూస్ట్ ఇచ్చింది. ఇందులో సీతామహాలక్ష్మి అనే పల్లెటూరి అమ్మాయి పాత్రలో సంగీత అభినయం అందరినీ ఆకట్టుకుంది. ఈ సినిమాలో హైలెట్ అయ్యిన పాత్రలలో సంగీతది కూడా ఒకటి. ఈ సినిమా తర్వాత సంగీతకు తెలుగులో అవకాశాలు కూడా బాగా వచ్చాయి. పెళ్లాం ఊరెళితె, ఈ అబ్బాయి చాలా మంచోడు, ఆయుధం, ఓరి నీ ప్రేమ బంగారంగానూ, శివపుత్రుడు, నేను పెళ్లికి రెడీ, టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్, విజయేంద్ర వర్మ, ఖుషీఖుషీగా, సంక్రాంతి తదితర సినిమాలతో తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువైపోయిందీ అందాల తార.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : ఛీ ఛీ.. ఇదేం సినిమారా బాబు..! వయసులో ఉన్న భార్య, ముసలి భర్త.. మధ్యలో మరో వ్యక్తి

అయితే హీరోయిన్ గా సినిమా కెరీర్ పీక్స్ లో ఉండగానే సంగీత పెళ్లి చేసుకుంది. 2009లో తమిళ గాయకుడు క్రిష్ ను సంగీత వివాహం చేసుకుంది.పెళ్లి, పిల్లల తర్వాత కాస్త సినిమాలకు గ్యాప్ ఇచ్చిన సంగీత కొన్ని నెలల క్రితం సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. ఇదిలా ఉంటే సంగీత విడాకులు తీసుకుంటుంది అని టాక్ వినిపిస్తుంది. మనస్పర్థల కారణంగా సంగీత, క్రిష్‌ విడాకులు తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. తాజాగా సంగీత తన సోషల్ మీడియా అకౌంట్ లో పేరు మార్చేసింది. సంగీత క్రిష్ గా ఉన్న పేరును సంగీత యాక్ట్ గా మార్చుకుంది. దాంతో సంగీత దంపతులు విడిపోతున్నారని వస్తున్న రూమర్స్ కు ఆజ్యం పోసింది. దీనిపై సంగీతగానీ, క్రిష్‌గానీ స్పందించలేదు.

ఇది కూడా చదవండి : అప్పట్లో ఊపేసిన హీరోయిన్.. అందరితో నటించింది.. కానీ నాగార్జునను మాత్రం రిజెక్ట్ చేసింది

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *