బ్రొకోలీ తింటున్నారా.. అయితే ఇది తెలుసుకోండి

బ్రొకోలీ తింటున్నారా.. అయితే ఇది తెలుసుకోండి


బ్రకోలీలో ఫైబర్ అధికంగా ఉండటంతో అది జీర్ణవ్యవస్థపై ఒత్తిడిని పెంచుతుంది. దీనివల్ల కొందరిలో కడుపు ఉబ్బరం, గ్యాస్, మలబద్ధకం వంటి ఇబ్బందులు ఎదురవుతాయి. కనుక సున్నితమైన జీర్ణవ్యవస్థ ఉన్నవారు బ్రకోలీకి దూరంగా ఉండటమే శ్రేయస్కరం. ఇక బ్రకోలీలో ఉండే గోయిట్రోజెన్‌ సమ్మేళనాలు థైరాయిడ్ గ్రంథి పనితీరుకు ఆటంకం కలిగించి.. మన శరీరం అయోడిన్‌ను గ్రహించకుండా చేస్తాయి. దీనివల్ల థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తి తగ్గుతుంది. అలాగే, ఇప్పటికే థైరాయిడ్ ఉన్న వారు అతిగా బ్రకోలీ తీంటే సమస్య తీవ్రమయ్యే ప్రమాదం ఉంది. అంతేకాకుండా, బ్రకోలీలో విటమిన్ కె పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తం గడ్డకట్టడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే.. గుండె జబ్బులు లేదా ఇతర కారణాలతో రక్తం పల్చబడటానికి మందులు (బ్లడ్ థిన్నర్స్) వాడేవారు బ్రకోలీకి దూరంగా ఉండటం మంచిది.కొందరిలో బ్రకోలీ తినడం వల్ల అలెర్జీలు, చర్మంపై దద్దుర్లు, దురద, వాపు కనిపిస్తాయి. అలాంటి వారు దీనికి దూరంగా ఉండాలి. బ్రకోలీ ఆరోగ్యానికి మంచిదే గానీ, పరిమితంగా తీసుకోవాలి. ఆరోగ్య సమస్యలున్నవారు డాక్టర్ సలహాతో.. బ్రకోలీని తీసుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వైద్యులను సంప్రదించడం మంచింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మనోడే మొట్టమొదటి హీరో…! NTRతో అట్లుంటది మరి!

కామెర్లు ముదిరి కన్నడ స్టార్ హీరో మృతి.. షాక్‌లో కన్నడ ఇండస్ట్రీ!

సారథి స్టూడియోలో గొడవ.. షూటింగ్‌ను అడ్డుకుని కార్మికుడిని కొట్టిన యూనియన్ లీడర్

Renu Desai: రాజకీయ నాయకుల గురించి రేణు దేశాయ్‌ షాకింగ్ పోస్ట్.. ఆలా ఎలా అనేసింది

OTT ఆశలపై నీళ్లు చల్లిన ప్రొడ్యూసర్.. సక్కగా థియేటర్‌కు నడవాల్సిందే ఇక!

 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *