బ్యాంక్‌లో బంగారం పోతే బాధ్యత ఎవరిది? బ్యాంక్‌ నుంచి పరిహారం వస్తుందా? రాదా? RBI రూల్స్‌ ఏం చెబుతున్నాయంటే..?

బ్యాంక్‌లో బంగారం పోతే బాధ్యత ఎవరిది? బ్యాంక్‌ నుంచి పరిహారం వస్తుందా? రాదా? RBI రూల్స్‌ ఏం చెబుతున్నాయంటే..?


ఢిల్లీలోని కీర్తి నగర్‌లో ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) బ్రాంచ్‌లో బ్యాంక్ లాకర్‌లో బంగారం మాయమైందన్న ఆరోపణలతో ఒకసారి కలకలం రేగింది. ఒక మహిళ, ఆమె అత్తగారు తమ లాకర్‌లో ఉంచిన బంగారం కనిపించలేదని చెప్పడంతో ఈ వార్త సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అయింది. దీనితో ఇతర లాకర్ హోల్డర్లు కూడా తమ వస్తువులు చెక్ చేసేందుకు బ్యాంక్ వద్దకు చేరుకోవడంతో భారీ గందరగోళం ఏర్పడింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రాథమిక దర్యాప్తు చేపట్టారు. లాకర్లు పగలగొట్టిన ఆనవాళ్లు ఎక్కడా కనిపించలేదు. తదుపరి విచారణలో మహిళలకు ఉమ్మడి లాకర్ ఉందని, అది ఇటీవల ఫిబ్రవరి 5న నిర్వహించబడిందని వెల్లడైంది. పెద్ద ఎత్తున దొంగతనం జరిగిందన్న వార్తలు కేవలం పుకార్లేనని పోలీసులు స్పష్టం చేశారు. బ్యాంకు భద్రతలో ఎలాంటి లోపం కనిపించలేదని తెలిపారు.

బ్యాంక్ లాకర్‌లో వస్తువులు పోతే బాధ్యత ఎవరిది?

చాలామంది అనుకునేలా బ్యాంక్ లాకర్‌లో ఉన్న వస్తువులకు బ్యాంక్ పూర్తి బాధ్యత వహించదు. బ్యాంకులు కేవలం నిల్వ సౌకర్యం మాత్రమే అందిస్తాయి. లాకర్‌లో ఏమి ఉంచారో వారు రికార్డు కూడా ఉంచరు. RBI నిబంధనల ప్రకారం బ్యాంక్ బాధ్యత తమ నిర్లక్ష్యం నిరూపితమైతే మాత్రమే ఉంటుంది.

  • ప్రధాన భద్రతా వైఫల్యం
  • సీసీటీవీ పనిచేయకపోవడం
  • సిబ్బంది తప్పిదం
  • బ్యాంకు ఉద్యోగుల మోసం

పరిహారం ఎంత ఇస్తారు?

2022 RBI నియమాల ప్రకారం.. బ్యాంక్ తప్పిదం వల్ల నష్టం జరిగితే వార్షిక లాకర్ అద్దెకు 100 రెట్లు వరకు మాత్రమే పరిహారం. లాకర్ అద్దె రూ.4,000 అయితే గరిష్ట పరిహారం రూ.4 లక్షలు మాత్రమే. లాకర్‌లో కోట్ల విలువ వస్తువులు, బంగారం, దస్తావేజులు ఉన్నా కూడా అంతే ఇస్తారు. వరదలు, భూకంపాలు వంటి ప్రకృతి వైపరీత్యాలకు బ్యాంక్ బాధ్యత ఉండదు.

లాకర్ వాడేవారు తప్పక తెలుసుకోవాల్సినవి

  • లాకర్ అగ్రిమెంట్‌ను జాగ్రత్తగా చదవండి
  • లోపల ఉంచిన వస్తువుల జాబితా, ఫోటోలు ఉంచుకోండి
  • కొనుగోలు రశీదులు భద్రపరచండి
  • నష్టం జరిగితే వెంటనే పోలీసులకు, బ్యాంకుకు రాతపూర్వక సమాచారం ఇవ్వండి
  • ఖరీదైన వస్తువులకు వ్యక్తిగత బీమా తప్పనిసరి

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *