బొప్పాయి మాత్రమే కాదు, దాని గింజలు, ఆకులు కూడా అమృతంగా పరిగణిస్తారు. బొప్పాయి గింజలను సాధారణంగా కొత్త మొక్కలను పెంచడానికి ఉపయోగిస్తారు. కానీ, దీన్ని తినడం వల్ల మన శరీరం ఎన్ని ప్రయోజనాలను పొందుతుందో తెలిస్తే మీరు షాక్ అవుతారు. బొప్పాయిలోని పపైన్ ఎంజైమ్ కడుపు, పేగులకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో, శరీరాన్ని శుద్ధి చేయడంలో, పోషకాలను గ్రహించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.