సినిమా ఇండస్ట్రీలోనే అతను టాప్ హీరో. ఆయన సినిమా వస్తుందంటే చాలు అభిమానులు పూనకాలతో ఊగిపోతుంటారు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేని ఓ సాధారణ సికింద్రాబాద్ కుర్రాడు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నాడు. హీరోగా ఒకొక్క మెట్టు ఎక్కుతూ స్టార్ హీరోగా మారాడు. ఎన్నో సవాళ్లు, అవమానాలను ఎదుర్కొని స్టార్ హీరోగా ఎదిగాడు. తెలుగు, తమిళంలో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి మెప్పించాడు. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. దక్షిణాదిలో అత్యధిక ఫ్యాన్ బేస్ హీరో అతను. రీసెంట్ డేస్‌లో వరుసగా హిట్స్ అందుకున్నాడు. ఇంతకీ అతడు ఎవరో తెలుసా.. ?
ఇదెక్కడి మేకోవర్ మావ..! అల్లుఅర్జున్ వరుడు హీరోయిన్ గుర్తుందా.? ఇప్పుడు సినిమాలు మానేసి
తమిళ్ హీరోలకు తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంటుంది. తెలుగులో విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉన్న హీరోల్లో అజిత్ ఒకరు. 1971 మే 1న సికింద్రాబాద్ లో జన్మించారు అజిత్. తండ్రి పి.సుబ్రమణ్యం కేరళకు చెందిన వ్యక్తి. చిన్నప్పటి నుంచి చదువుపై అంతగా ఆసక్తి లేని అజిత్.. కేవలం 10వ తరగతి వరకు మాత్రమే చదువుకున్నారు. ఆ తర్వాత బైక్ మెకానిక్ గా పనిచేశాడు. చదువులో ప్రావీణ్యం లేకపోయినా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, ఇంగ్లీష్ భాషలు అనర్గళంగా మాట్లాడతాడు. తెలుగు, తమిళంలో అనేక హిట్ చిత్రాల్లో నటించి టాప్ హీరోగా ఎదిగాడు అజిత్.
ఇవి కూడా చదవండి
ఛీ ఛీ.. ఇదేం సినిమారా బాబు..! వయసులో ఉన్న భార్య, ముసలి భర్త.. మధ్యలో మరో వ్యక్తి
తాజాగా అజిత్ ఓ ఎమోషనల్ నోట్ షేర్ చేశాడు. సినిమా ఇండస్ట్రీలో నేను 33 ఏళ్లు పూర్తి చేసుకున్నా… ఈ సందర్భంగా మీతో కొన్ని విషయాలు పంచుకోవాలనుకుంటున్నా.. గడిచిన ప్రతి సంవత్సరం నాకు ఓ మైలు రాయి. మరెన్నో మైలు రాళ్ళకోసం ఎదురుచూస్తున్నా.. ఈ అందరి ప్రేమకు కృతజ్ఞతలు తెలుపుతున్నా.. నా ఈ ప్రయాణం అంత ఈజీగా సాగలేదు. నేను సినిమా బ్యాగ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి రాలేదు. ఎన్నో సవాళ్లు , అవమానాలు ఎదుర్కున్నా..జీవితంలో ఎన్నో మానసిక ఒత్తిడిలు, ఎదురుదెబ్బలు, వైఫల్యాలు నిరంతరం పరీక్షించాయి. కానీ నేను ఎప్పుడూ ఆగిపోలేదు. అన్నింటిని ఎదుర్కొన్నా.. సినిమాల్లో ఊహించని ఫ్లాపులు చూశా.. ఇక నేను ముందుకు సాగలేను అనుకున్న ప్రతిసారి మీరు ప్రేమతో నన్ను ప్రోత్సహించారు. నా దగ్గర ఏమీ లేనప్పుడు కూడా మీరు నాతో ఉన్నారు. నేను ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నానంటే మీ ప్రేమే అందుకు కారణం.. ఇలాంటి గొప్ప అభిమానులు దొరకడం నా అదృష్టం. నా భార్య షాలిని లేకపోతే ఇదంతా సాధ్యమయ్యేది కాదు. ఇక రేసింగ్ లోనూ నన్ను చాలా మంది అవమానించారు, నన్ను ఆడుకోవాలని చూశారు. రేసింగ్‌లోనూ మనదేశం గర్వపడేలా చేస్తానని మాటిస్తున్నాను అంటూ అజిత్ రాసుకొచ్చారు.
అప్పట్లో ఊపేసిన హీరోయిన్.. అందరితో నటించింది.. కానీ నాగార్జునను మాత్రం రిజెక్ట్ చేసింది
అజిత్ కుమార్ ..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.