బేగంపేట స్టేషన్‌లో దిగిన మహిళ.. ఆమె తెచ్చిన భారీ సూట్‌కేస్ తెరిచి చూడగా షాక్‌

బేగంపేట స్టేషన్‌లో దిగిన మహిళ.. ఆమె తెచ్చిన భారీ సూట్‌కేస్ తెరిచి చూడగా షాక్‌


తెలంగాణ ఈగల్ టీం అధికారులు గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ క్రమంలో గురువారం హైదరాబాద్‌లో గంజాయి తరలిస్తున్న మహిళను అరెస్ట్ చేశారు. ఆమె వద్ద నుంచి సుమారు రూ.8 లక్షల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఒడిశాకు చెందిన మమతా దిగాల్ ప్రస్తుతం నవీ ముంబైలో నివాసం ఉంటుంది. ఆమె భువనేశ్వర్ నుంచి ముంబైకి వెళ్తున్న సమయంలో బేగంపేట వద్ద భారీ లగేజ్‌తో అనుమానాస్పదంగా కనిపించడంతో.. ఈగిల్ అధికారులు పట్టుకున్నారు. ఆమె సూట్‌కేస్‌లు తనిఖీ చేయగా తొమ్మిది ప్యాకెట్ల గంజాయి బయటపడింది. విచారణలో కీలక విషయాలు వెల్లడయ్యాయి. ముంబైకి చెందిన డ్రగ్ పెడ్లర్ అశోక్ ఆదేశాల మేరకు భువనేశ్వర్‌కు వెళ్లినట్లు, అక్కడ గుర్తు తెలియని వ్యక్తి నుంచి గంజాయి ఉన్న సూట్‌కేస్‌ను అందుకున్నట్లు మమతా తెలిపింది. ఒక్కో గంజాయి బ్యాగ్ తరలింపునకు రూ.10 వేల చొప్పున అశోక్ చెల్లిస్తానని చెప్పినట్లు వెల్లడించింది. అశోక్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మరో ఘటనలో ఎక్సైజ్ శాఖ స్పెషల్ టీమ్ నాంపల్లి మంగారు బస్తీలోని ఓ ఇంటిపై దాడులు నిర్వహించింది. గణేష్, సరళ అనే ఇద్దరు వ్యక్తులు ఇంట్లోనే గంజాయిని చిన్న ప్యాకెట్లుగా చేసి విక్రయిస్తున్నట్లు సమాచారం అందడంతో అధికారులు సోదాలు చేపట్టారు. వారి వద్ద నుంచి 1.3 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 180 చిన్న ప్యాకెట్లు బయటపడ్డాయి. ఈ కేసులో మహమ్మద్ సోహైల్, యు.సీతల్ అనే మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వారిని త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Renu Desai: మరో జన్మ వరకు ఎందుకు ?? ఈ జన్మలోనే అన్నీ క్లియర్ చేస్తా

Mega158: ‘జన నాయగన్‌’ ఎఫెక్ట్.. చిక్కుల్లో చిరు నెక్స్ట్‌ మూవీ ??

రాజా సాబ్ ప్రతిష్ఠను దెబ్బతీస్తున్నారంటూ.. సైబర్‌ పోలీసులకు SKN ఫిర్యాదు

Anil Ravipudi: అసాధ్యుడువయ్యా… అర్థ రూపాయితో పది రూపాయలు కొట్టేశావ్‌ మరి

‘పాటల రచయితపై చెప్పు విసిరిన మహిళ..’కట్ చేస్తే షాకింగ్ నిజం



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *