టీ ఎవరు తాగరు చెప్పండి. చాలా మంది ఎంతో ఇష్టంగా ప్రతి రోజూ టీ తాగుతుంటారు. ఇక టీ తాగడం వలన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ కొన్ని సార్లు దీని వలన దుష్ఫ్రభావాలు ఎక్కువగా ఉంటాయని చెబుతారు. ముఖ్యంగా కొన్నిరకాల అనారోగ్య సమస్యలతో బాధపడే వారు అస్సలే టీ తాగకూడదు అంటారు. కాగా, ఇప్పుడు మనం బీపీ ఉన్నవారు టీ తాగడం మంచిదేనో, కాదో ఇప్పుడు తెలుసుకుందాం.
బీపీ ఉన్న వారు టీ తాగడం ఆరోగ్యానికి అస్సలే మంచిది కాదు అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే? టీలో కెఫీన్ ఎక్కువగా ఉంటుంది. అందువలన దీనిని ప్రతి రోజూ తినడం వలన ఇది రక్తపోటును పెంచడమే కాకుండా, ఇది శరీరంపై కూడా తీవ్ర ప్రభావం చూపిస్తుందంట. బీపీ ఉన్న వారు టీని అతిగా అస్సలే తీసుకోకూడదంట. దీని వలన రక్తపోటు పెరిగే ప్రమాదం ఉంటుందంట. అయితే కొంత మందికి టీ మానెయ్యడం కూడా ఓ సవాలు లాంటిదే.
అందుకే ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారంటే? బీపీ సమస్యతో బాధపడేవారు రోజుకు ఒక కప్పుకు మించి టీని తీసుకోకూడదు. రోజుకు ఒక కప్పు టీ తాగడం వలన ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదం ఉండదని సూచిస్తున్నారు. ఇక కొందరు ఉదయం లేచిన వెంటన పరగడుపున టీ తీసుకుంటారు. అయితే ఇది అస్సలే ఆరోగ్యానికి మంచిది కాదంట. దీని వలన గుండెల్లో మంట, ఎసిడిటీ సమస్యలు వస్తుంటాయి.

ఇక రక్తపోటు నియంత్రణలో ఉండటం లేదు అని అనుకునే వారు పూర్తిగా, టీ తాగడం మానెయ్యాలి అని చెబుతున్నారు నిపుణులు. ముఖ్యంగా బీపీ సమస్యతో బాధపడే వారు టీ తాగే సమయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలంట. లేకపోతే ఇబ్బందులు తప్పవని హెచ్చిరిస్తున్నారు వైద్యులు. నోట్ : ఈ సమాచారం ఇంటర్నెట్లోని సమాచారం మేరకు మాత్రమే ఇవ్వబడినది, టీవీ9 తెలుగుదీనిని ధృవీకరించడం లేదు.