ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో బిర్యాని తినేందుకు వెళ్లిన ఓ యువకుడికి షాకింగ్ అనుభవం ఎదురైంది. రుచికరమైన బిర్యాని తిందామన్న ఆశతో రెస్టారెంట్‌కు వెళ్లిన బాధితుడు, తిరిగి వచ్చేసరికి తన బైక్ చోరీకి గురైనట్టు గుర్తించాడు. లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు. సత్తుపల్లి పట్టణంలోని ఓ ప్రసిద్ధ రెస్టారెంట్ ముందు బైక్‌ను పార్క్ చేసి భోజనం చేసేందుకు వెళ్లిన బాధితుడు, కొద్దిసేపటి తర్వాత బయటకు వచ్చి చూసేసరికి అక్కడ బైక్ కనిపించకపోవడంతో షాక్‌కు గురయ్యాడు. వెంటనే రెస్టారెంట్ యజమాని సహకారంతో అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరా ఫుటేజ్‌ను పరిశీలించాడు. అందులో ముఖానికి మాస్క్ ధరించిన ఓ దుండగుడు బైక్‌ను చాకచక్యంగా దొంగిలించి తీసుకెళ్లినట్లు స్పష్టంగా కనిపించింది. ఈ ఘటనపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా దొంగను గుర్తించే పనిలో పడ్డారు. ఈ ఘటన పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. ఇష్టమైన బిర్యాని తిన్నాననే ఆనందం క్షణాల్లోనే మాయమై, బైక్ చోరీతో తీవ్ర ఆవేదన మిగిలిందని బాధితుడు వాపోయాడు. ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో వాహనాలు పార్క్ చేసే సమయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఫోన్ ట్యాపింగ్ కేసులో ట్విస్ట్.. KCR రిక్వెస్ట్ ను రిజెక్ట్ చేసిన SIT
చంద్రుడికి పొంచి ఉన్న ముప్పు.. భూమికి ప్రమాదం?
కదిరి లక్ష్మీనరసింహస్వామి రథానికి తాళ్లరేవు కొబ్బరితాడు
సందర్శకులను కట్టి పడేస్తున్న అరుదైన పుష్పాల ఫ్లవర్ షో
యాదగిరిగుట్టలో ఏం జరిగింది.. బంగారు, వెండి డాలర్లు ఎక్కడ?