ఇంట్లోని బాత్‌రూమ్‌లో ఓ బిడ్డకు జన్మనిచ్చిన మహిళ.. శిశువు గొంతునొక్కి దారుణంగా హత్యచేసిన ఘటన దేశ రాజధాని ఢిల్లీలో వెలుగు చూసింది. పారిశుద్య సిబ్బంది గమనించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు సదరు మహిళను అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలికి చెందిన 26 ఏళ్ల రోష్ని అనే మహిళకు 2019లో ఒక వ్యక్తితో పెళ్లి జరిగింది. అయితే కొన్ని కారణాల వల్ల ఆమె అతనితో విడిపోయి ఢిల్లీలోని పటేల్ నగర్‌లో ఒక ఇంట్లో పనిమనిషిగా పనిచేస్తూ జీవనం సాగిస్తుంది. ఈ క్రమంలో తమ గ్రామానికి చెందిన ఒక యువకుడితో ఆమె ప్రేమలో పడింది.
ఈ క్రమంలో తమ బంధువుల పెళ్లి కోసం యూపిలోని తమ గ్రామానికి వెళ్లిన సదరు మహిళ అక్కడ తన ప్రియుడితో శారీరకంగా కలిసింది. ఇక పెళ్లి తంతు ముగిసిన తర్వాత మళ్లీ ఢిల్లీకి తిరిగి వచ్చి పనికి వెళ్లడం స్టార్ట్ చేసింది. అయితే ఢిల్లీకి చేరుకున్న కొన్ని రోజులకు ఆమె గర్భం దాల్చినట్టు తెలిసింది. దీంతో వెంటనే ఆ విషయాన్ని తన ప్రియుడికి చెప్పింది. అయితే ఈ విషయంలో తాను ఏమి చేయలేనని ప్రియుడు చెప్పినట్టు తెలుస్తోంది. దీంతో ఏం చేయాలో సదరు మహిళకు అర్థం కాలేదు. తన గర్భవతి అన్న విషయం తన ఇంటి ఓనర్స్ నుంచి దాచేందుకు తనకు కడుపులో సమస్య ఉన్నట్టు చెప్పింది.
అమెను నెలలు నిండుతున్న క్రమంలో ఆమె పనిచేసి ఇంటి యజమానులు కుటుంబంతో సహా బయటకు వెళ్లారు. అయితే అదే సమయంలో రేష్మకి నొప్పులు రావడం స్టార్ట్ అయ్యాయి. దీంతో ఆమెకు ఇంట్లోని బాత్‌రూమ్‌లో మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఈ విషయం బయటకు తెలిస్తే ఏం జరుగుతుందోనని భయపడిన ఆమె శిశువును గొంతునొక్కి హత్య చేసింది. ఆ తర్వాత శిశువు మృతదేహాన్ని కవర్‌లో పెట్టి అపార్ట్ ఆవరణలో ఉన్న ఒక డస్ట్‌బిన్‌లో పడేసింది. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయింది.
అయితే రెండ్రోజుల తర్వాత చెత్త తీసుకెళ్లేందుకు వచ్చిన పారిశుద్య కార్మికులు డస్ట్‌బిన్‌లో శిశువు మృతదేహాన్ని గుర్తించారు. వెంటనే ఇంటి యజమానికి సమాచారం ఇచ్చారు.
విషయం తెలుసుకున్న ఇంటి యజమానికి పోలీసులు సమాచారం ఇచ్చారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు శిశువు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్ట్‌మార్టం కోసం హాస్పిటల్‌కు తరలించారు. ఇక ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు అనంతరం సదరు మహిళను అరెస్ట్ చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.