బిడ్డకు పాలిస్తున్న తల్లి.. క్షణాల్లో..

బిడ్డకు పాలిస్తున్న తల్లి.. క్షణాల్లో..


వివాహేతర సంబంధం కారణంగా చోటుచేసుకున్న దారుణ ఘటనలో ఓ మహిళ సజీవదహనమైంది. నాంపల్లి మండలం కేతేపల్లికి చెందిన నగేష్ యాదవ్ భార్య మమత పై అదే గ్రామానికి చెందిన సుజాత పెట్రోల్ పోసి నిప్పంటించడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసుల వివరాల ప్రకారం.. నగేష్‌కు మర్రిగూడ మండలం సరంపేటకు చెందిన మమతతో ఎనిమిదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే పెళ్లికి ముందునుంచే నగేష్‌కు సుజాతతో వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయం తెలిసి కుటుంబంలో తరచూ గొడవలు జరిగాయి. గ్రామ పెద్దలు, బంధువులు హెచ్చరించడంతో ఇద్దరి మధ్య దూరం పెరిగింది. దీంతో ప్రియుడిని దక్కించుకునేందుకు నగేష్ భార్యను అంతమొందించాలని సుజాత పథకం వేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. శనివారం సుజాత లీటర్‌కు పైగా పెట్రోల్, కత్తి, కారం తీసుకుని నగేష్ ఇంటికి వెళ్లింది. ఆ సమయంలో మమత ఇంటిముందు తన ఆరు నెలల బాబుకు పాలిస్తోంది. వెనుక నుంచి వచ్చి ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించింది. మంటలు వేగంగా వ్యాపించడంతో తీవ్ర గాయాలతో మమత అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు క్లూస్ టీంతో ఘటనాస్థలంలో ఆధారాలు సేకరించి కేసు నమోదు చేశారు. సుజాతపై కఠిన చర్యలు తీసుకోవాలని మమత కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. నగేష్ పాత్రపై కూడా విచారణ జరపాలని బంధువులు ఆరోపిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఏపీ సహా 4 రాష్ట్రాల్లో రేర్ ఎర్త్ మినరల్స్ కోసం పథకం

ఆలయంలో నాగుపాము.. భక్తుల్లో భయం

విద్యార్థులకు బిగ్ రిలీఫ్.. స్కూల్‌లోనే అంతా..

బాబోయ్‌ పులి.. ఎమ్మెల్యే బుచ్చయ్య ముందునుంచే వెళ్లి

సైలెంట్ కిల్లర్స్‌గా ఇయర్‌ఫోన్స్.. అతిగా వాడితే వచ్చే సమస్యలు ఇవే



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *