బిగ్‌బాస్ ఆదిరెడ్డి కూతురును చూశారా? అన్నప్రాశన వేడుకలో డబ్బులు, నగలను కాదని ఏం తీసుకుందో తెలుసా? వీడియో

బిగ్‌బాస్ ఆదిరెడ్డి కూతురును చూశారా? అన్నప్రాశన వేడుకలో డబ్బులు, నగలను కాదని  ఏం తీసుకుందో తెలుసా? వీడియో


బిగ్‌బాస్‌ మాజీ కంటెస్టెంట్‌ ఆదిరెడ్డి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. యూట్యూబర్ గా, రివ్యూయర్ గా, .. ఇలా తెలుగు రాష్ట్రాల్లో బాగానే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఆది రెడ్డి. బిగ్ బాస్ తెలుగు ఆరో సీజన్ లో కామన్ మ్యాన్ కోటాలో ఎంట్రీ ఇచ్చిన అతను తన ఆట, మాట తీరుతో బిగ్ బాస్ ఆడియెన్స్ మనసులు గెల్చుకున్నాడు. కప్పు కొట్టకపోయినా టాప్-5 కంటెస్టెంట్లలో ఒకరిగా నిలిచి అందరి మన్ననలు అందుకున్నాడు. ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక సొంతంగా ఒక యూట్యూబ్ ఛానెల్ ను నిర్వహిస్తున్నాడు ఆది రెడ్డి. అందులో బిగ్ బాస్ తో పాటు అప్పుడప్పుడు సినిమాలపైనా రివ్యూలు ఇస్తున్నాడు. అలాగే ఇస్మార్ట్ జోడీ అంటూ కొన్ని టీవీ షోల్లోనూ సందడి చేస్తున్నాడు. ఇదిలా ఉంటే గతేడాది ఆది రెడ్డి రెండో సారి తండ్రి అయ్యాడు. అతని భార్య కవిత ఆగస్టు 05న పండంటి మహాలక్ష్మికి జన్మనిచ్చింది. అప్పటికే ఈ దంపతులకు అద్విత అనే అమ్మాయి ఉంది. రెండోసారి కూతురు పుట్టడంతో ఆది రెడ్డి దంపతుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఇక అక్టోబర్ లో తమ కూతురికి నామకరణ మహోత్సవం నిర్వహించాడు ఆది రెడ్డి. తమ గారాల పట్టికి నైరాశ్రీ అని పేరు పెట్టారు.

తాజగా తమ ముద్దుల కూతురికి అన్నప్రాశన వేడుక నిర్వహించారు ఆది రెడ్డి దంపతులు. కాగా అన్నప్రాశన సమయంలో నగలు, డబ్బు, పుస్తకము, కలము, ఆయుధము, పూలు మొదలైన బిడ్డ దగ్గర వదులుతారు. ఈ క్రమంలో ఆది రెడ్డి కూతురు డబ్బులు, నగలను కాదని డైరెక్టుగా భగవద్గీత పుస్తకం దగ్గరకు వెళ్లింది. ఇందుకు సంబంధించిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు ఆది రెడ్డి దంపతులు. ‘ మా బిడ్డకి మీ ఆశీర్వాదాలు కావాలంటూ’ కోరారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. దీనిని చూసిన పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఆది రెడ్డి దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఇవి కూడా చదవండి

వీడియో ఇదిగో..

కాగా 2020లో కవిత అనే అమ్మాయితో కలిసి పెళ్లిపీటలెక్కాడు ఆది రెడ్డి. కొన్నేళ్లకు అద్విత అనే అమ్మాయి వీరి జీవితంలోకి అడుగు పెట్టింది. ఇప్పుడు నైరాశ్రీ రాకతో ఇద్దరు మహాలక్ష్ములతో ఆది రెడ్డి ఇల్లు కళకళలాడుతోంది.

భార్య, కూతుళ్లతో ఆదిరెడ్డి..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *