బాలకృష్ణకు తల్లిగా, భార్యగా నటించిన ఈ హీరోయిన్ ఎవరో తెలుసా..? ఒక్క సినిమాతోనే మాయం అయ్యింది.. 

బాలకృష్ణకు తల్లిగా, భార్యగా నటించిన ఈ హీరోయిన్ ఎవరో తెలుసా..? ఒక్క సినిమాతోనే మాయం అయ్యింది.. 


నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అఖండ 2 షూటింగ్ లో బిజీగా ఉన్నారు. కుర్ర హీరోలకు ఏ మాత్రం తగ్గకుండా సినిమాలు చేసి మెప్పిస్తున్నారు బాలకృష్ణ. రీసెంట్ డేస్‌లో బాలయ్య నటించిన సినిమాలన్నీ మంచి విజయాలను అందుకుంటున్నాయి. మాస్ యాక్షన్ చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తున్నారు. ఒక్కో సినిమాకు రూ.50 కోట్లకు పైగా వసూళ్లు రాబడుతూ.. నందమూరి లెగసీని చెక్కు చెదరకుండా కాపాడుతున్నారు. ఇటీవల వరుసగా 4 సినిమాలతో రూ.100 కోట్లపైగా కలెక్షన్స్ రాబట్టారు. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ భూషణ్ అవార్డ్ సైతం స్వీకరించారు. ఇటీవలే బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా అఖండ 2 సినిమా నుంచి వీడియో గ్లింప్స్ విడుదల చేశారు.

ఇదిలా ఉంటే బాలకృష్ణ కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. అలాగే ఎంతో మంది హీరోయిన్స్ తో కలిసి నటించారు బాలకృష్ణ. అయితే బాలకృష్ణకు తల్లిగా, భార్యగా నటించిన హీరోయిన్స్ కూడా చాలా మంది ఉన్నారు. వారిలో ఈ హీరోయిన్ ఒకరు. ఆమె ఒకే ఒక్క సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. కానీ ఆమె ఒకే ఒక్క సినిమాతో టాలీవుడ్ నుంచి మాయం అయ్యింది. ఇంతకూ ఎవరో తెలుసా.?

హానీ రోజ్.. ఒకే ఒక్క సినిమాతో విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది . హనీరోజ్.. తెలుగులో ఈ అమ్మడు ఒకే ఒక్క సినిమాతో కుర్రాళ్ళ హాట్ ఫెవరెట్ అయ్యిపోయింది. మలయాళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ ముద్దుగుమ్మ.. తెలుగులో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి సినిమాతో తెలుగు ప్రేక్షకులను మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. వీరసింహారెడ్డి సినిమాలో రెండు డిఫరెట్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి ఆకట్టుకుంది ఈ చిన్నది. బాలకృష్ణ తల్లిగా, భార్యగా నటించి మెప్పించింది. అలాగే ఈ అమ్మడు అందంతోనే కాదు నటన పరంగాను మంచి మార్కులు తెచ్చుకుంది. అయితే ఈ సినిమా తర్వాత హనీ రోజ్ సినిమాలు చేయలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *