బాబోయ్.. విమానంలో బొద్దింకలు.. సారీ చెప్పిన ఎయిర్‌ ఇండియా

బాబోయ్.. విమానంలో బొద్దింకలు.. సారీ చెప్పిన ఎయిర్‌ ఇండియా


ఎయిర్ ఇండియా AI180 విమానంలో బొద్దింకలు కలకలం రేపాయి. శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి ముంబై వెళ్తున్న విమానంలో బొద్దింకలు కనిపించడంతో ఇద్దరు ప్రయాణికులు అసౌకర్యానికి గురయ్యారు. వారిని ఇతర సీట్లకు మార్చడంతో సమస్య తాత్కాలికంగా పరిష్కారమైంది. ఆ తర్వాత విమానం ఫ్యూయల్‌ ఫిల్లింగ్‌కోసం కోల్‌కతాలో ఆగినప్పుడు గ్రౌండ్‌ సిబ్బంది విమానాన్ని డీప్‌ క్లీన్‌ చేసినట్లు ఎయిర్‌ ఇండియా ప్రతినిధి తెలిపారు. తర్వాత షెడ్యూల్ సమయం ప్రకారమే ముంబయికి విమానం చేరుకుంది.

జరిగిన ఘటనపై సంస్థ క్షమాపణలు తెలిపింది. ఈ సంఘటన దురదృష్టకరమని ఎయిర్ ఇండియా ఒక ప్రకటన విడుదల చేసింది. ఎయిర్‌ ఇండియా సంస్థ విమాన నిర్వహణపరంగా అంతా సక్రమంగానే ఉన్నప్పటికీ.. గ్రౌండ్ ఆపరేషన్స్ సమయంలో ఈ కీటకాలు ఒక్కోసారి విమానంలోకి ప్రవేశించే అవకాశం ఉంటుందని ఎయిరిండియా ప్రతినిధి తన ప్రకటనలో పేర్కొన్నారు. అలాగే ఈ ఘటనకు గల కారణాలపై దర్యాప్తు నిర్వహిస్తున్నామని చెప్పారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి…





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *