బ్రోకలీలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. తద్వారా అనేక రకాల ఇన్ఫెక్షన్లకు దూరంగా ఉండొచ్చు. బ్రోకలీలో డైటరీ ఫైబర్ మెండుగా ఉంటుంది. ఇది పేగులను ఆరోగ్యంగా ఉంచి మలబద్ధకం ఏర్పడకుండా కాపాడుతుంది. అలాగే కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యల నుంచి ఉపశమనం కల్పిస్తుంది. అయితే పచ్చిగా తింటే మాత్రం జీర్ణ సమస్యలు వస్తాయి. బ్రోకలీలో పొటాషియం, ఫైబర్, ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ వంటి గుండెకు మేలు చేసే పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి రక్తపోటు అదుపులో ఉంచి హృదయ సంబంధ సమస్యలు రాకుండా కాపాడుతాయి.
బ్రోకలీలో యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. ముఖ్యంగా ఇందులో ఉంటే సల్ఫోరఫేన్ అనే సమ్మేళనం ఫ్రీ రాడికల్స్ వల్ల శరీర కణాలు డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది. తద్వారా క్యాన్సర్ వంటి మహమ్మారి రాకుండా అడ్డుకోవచ్చు. బ్రోకలీలో గ్లుకోసినోలేట్స్ అనే సమ్మేళనాలు ఉంటాయి. ఇవి శరీరంలోని విషపదార్థాలను బయటకు పంపడంలో సహాయపడతాయి. తద్వారా కాలేయంపై ఒత్తిడి తగ్గుతుంది. లివర్ ఆరోగ్యంగా ఉంటుంది. బ్రోకలీలో కాల్షియం, విటమిన్ కె వంటి పోషకాలు ఉంటాయి. ఇవి ఎముకలకు కావాల్సినంత బలం అందిస్తాయి. తద్వారా వయసు పెరిగినా ఎముకలు బలంగా ఉంటాయి.
బ్రోకలీలో కేలరీలు తక్కువగా, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీంతో ఇది తింటే తొందరగా కడుపు నిండిన ఫీలింగ్ కలిగి ఆకలి అదుపులో ఉంటుంది. దీంతో బరువు తగ్గవచ్చు. బ్రోకలీలో విటమిన్ ఎ, సి, కెతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. ఇవి కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి చర్మం ఎల్లపుడూ యవ్వనంగా ఉండేలా చూస్తాయి. దీంతో వయసు పెరిగినా వృద్ధాప్య ఛాయలు రాకుండా కాపాడుకోవచ్చు. బ్రోకలీలో గ్జియాంథిన్, ల్యూటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్లతో పాటు విటమిన్ ఎ ఉంటుంది. ఇవి కంటిచూపును కాపాడుతాయి. కంటి సంబంధ సమస్యలు రాకుండా రక్షిస్తాయి.
ఇవి కూడా చదవండి
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..