ఓ దంపతులు బైక్ మీద వెళుతుండగా ఆపిన పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ అని 10,000 రూపాయలు కట్టమని చెప్పారు. దీంతో సదరు బాధితులు ఏం చేయాలో తెలియక నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డికి ఫోన్ చేశారు. ఎమ్మెల్యే నేరుగా ఘటనా స్థలానికి చేరుకొని ట్రాఫిక్ పోలీసులకు ఫోన్ చేశారు. తాను ఆర్టీసీ బస్టాండ్ దగ్గర ఉన్నానని, తక్షణమే బైకును బాధితులకు హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పారు. దీంతో క్షణాల్లో బైకును ఆర్టీసీ బస్టాండ్ కి తీసుకొచ్చి దంపతులకు అప్పగించారు పోలీసులు. తమకు చేసిన సాయానికి వారిరువురు ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపారు. రాత్రి సమయంలో ఎమ్మెల్యేలు ఫోన్ తీయడమే కష్టం. అలాంటిది ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి నేరుగా వచ్చి తమ సమస్యను తీర్చడంతో వారు కృతజ్ఞతలు తెలిపారు. భార్యాభర్తలు అందులోనూ అర్థరాత్రి సమయంలో పోలీసులు ఇలా బైక్ తీసుకెళ్లడం, పైగా మద్యం సేవించకుండానే డ్రంక్ అండ్ డ్రైవ్ అని ఫైన్ కట్టమని డిమాండ్ చేయడంతో ఇక చేసేదేమీ లేక ఎమ్మెల్యేకి ఫోన్ చేశారు. స్వయంగా ఎమ్మెల్యేనే రంగంలోకి దిగి తమకు సాయం చేయడంతో ఆ దంపతులు ఊపిరి పీల్చుకున్నారు.
మరిన్ని వీడియోల కోసం :