బద్ధలైన అగ్నిపర్వతం.. 1300 అడుగుల ఎత్తుకు ఎగసిపడ్డ లావా

బద్ధలైన అగ్నిపర్వతం.. 1300 అడుగుల ఎత్తుకు ఎగసిపడ్డ లావా


అమెరికాకు చెందిన హవాయి ద్వీపంలో అత్యంత క్రియాశీల అగ్నిపర్వతాల్లో ఒకటైన కిలోవేయ మరోసారి భగ్గుమంది. అగ్నిపర్వతం నుంచి లావా పెద్దఎత్తున ఉబికివచ్చి వందల అడుగుల ఎత్తు వరకు ఎగసిపడింది. ఆదివారం తెల్లవారుజామున మొదలైన విస్ఫోటనం దాదాపు 10 గంటలపాటు కొనసాగింది. 1300 అడుగుల ఎత్తుకు లావా ఎగసి పడినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. 2,80,000 ఏళ్ల చరిత్రను కలిగి ఉన్న ఈ అగ్నిపర్వతం.. 1952 నుంచి మొన్నటి వరకూ డజన్ల సార్లు బద్దలైంది. అగ్నిపర్వతం విస్ఫోటనం ధాటికి వెలువడిన పొగ, గ్యాస్, బూడిదతో కూడిన మేఘాలు.. సముద్ర మట్టానికి సుమారు 35 వేల అడుగుల ఎత్తుకు వ్యాపించాయి. ప్రపంచంలోనే అత్యంత క్రియాశీలక అగ్నిపర్వతాల్లో ఒకటి ‘కిలోవా’. యూఎస్ జియోలాజికల్ సర్వే నివేదిక ప్రకారం, ఈ విస్ఫోటనం దాదాపు 10 గంటల పాటు కొనసాగింది. అగ్నిపర్వత ముఖద్వారం నుంచి ఎర్రగా మండుతున్న లావా ఫౌంటెన్లు ఏకంగా 1,300 అడుగుల ఎత్తు వరకు ఆకాశంలోకి ఎగసిపడ్డాయి. ఈ అద్భుత దృశ్యాలు సమీపంలోని కెమెరాల్లో రికార్డయ్యాయి. కిలోవా అగ్నిపర్వతం ఒక క్రమ పద్ధతిలో స్పందిస్తోందని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని నెలలుగా ప్రతి విస్ఫోటనం 12 గంటల లోపే ముగుస్తోంది. ఒక విస్ఫోటనం తర్వాత మరోసారి లావా చిమ్మడానికి కొన్ని రోజుల నుంచి రెండు వారాల వరకు సమయం తీసుకుంటోంది. ప్రస్తుతం అగ్నిపర్వతం శాంతించింది. తదుపరి విస్ఫోటనం మార్చి మొదటి వారంలో ఉండవచ్చని అంచనా.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Intermittent Fasting: ఇంటర్‌మిటెంట్ ఫాస్టింగ్ అంతా ఉత్తిదేనా ? సైన్స్ చెప్పిన చేదు నిజం ఇదే

సముద్రంపై కాంతులీనుతూ యుద్ధ నౌకల కనువిందు

Gold Price Today: స్థిరంగా బంగారం ధర.. ఇవాళ ఎంతంటే ??

Pratyusha Case: నటి ప్రత్యూష మృతి కేసు.. సిద్ధార్థరెడ్డి లొంగిపోవాలి.. సుప్రీంకోర్టు తీర్పు

Ilaiyaraaja: ఇళయరాజాకు కోర్టు షాక్‌.. పాటల కాపీరైట్స్‌లో చుక్కెదురు



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *