బత్తాయిలు అంటూ మరో వీడియో వదలిన అన్వేష్.. ఇన్ స్టా బ్యాన్ పై ప్రపంచ యాత్రికుడు రియాక్షన్

బత్తాయిలు అంటూ మరో వీడియో వదలిన అన్వేష్.. ఇన్ స్టా బ్యాన్ పై ప్రపంచ యాత్రికుడు రియాక్షన్


ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన యూట్యూబర్, ప్రపంచ యాత్రికుడు పేరుతో పిలువబడే అన్వేష్ అంశం ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. ప్రపంచ దేశాలన్నీ చుట్టేస్తూ.. తెగ ఎంజాయ్‌ చేసేస్తూ.. ఆ వీడియోలను యూట్యూబ్ లో అప్‌లోడ్‌ చేస్తూ పాపులారిటీతో పాటు డబ్బులూ సంపాదిస్తున్నాడు అన్వేష్‌. అయితే ఈ మధ్యన బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేశారంటూ పలువురు ఫేమస్ యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ల పేర్లను బయట పెట్టాడీ ఫేమస్ యూట్యూబర్. ఇక ఇప్పుడు ఎక్కడ చూసిన ఇతని పేరే వినిపిస్తోంది. ఇటీవల హిందూ దేవుళ్లపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారని ఇప్పటికే అతనిపై పంజాగుట్ట పీఎస్‌లు పలువురు ఫిర్యాదులు చేయగా కేసు నమోదు చేసి.. అతని కోసం పోలీసుల వేట కొనసాగిస్తున్నారు పోలీసులు.

అలాగే పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో అన్వేష్ పై నమోదైన కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు సోషల్ మీడియా సంస్థకు( ఇన్ స్టా గ్రామ్ కు లేఖ కూడా రాశారు. ఈ క్రమంలో అన్వేష్ ఇన్ స్టా గ్రామ్ డీయాక్టివేట్ అయ్యింది.  అతని ఇన్ స్టా గ్రామ్ ను బ్యాన్ చేశారు. ఇన్స్ స్టా గ్రామ్ లో అన్వేష్‎కు సుమారు 1.8 మిలియన్ల ఫాలోవర్స్ ఉండేవారు. అయితే హిందూ దేవుళ్లకు వ్యతిరేకంగా వీడియోలు చేసిన తర్వాత ఆ సంఖ్య కాస్త 1.3 మిలియన్స్‎కు తగ్గింది. ఇప్పుడు ఏకంగా ఇన్ స్టా గ్రామ్ అకౌంట్ పై బ్యాన్ విధించారు.

దీని పై అన్వేష్ స్పందించాడు.. బత్తాయిలు అంటూ తనదైన శైలిలో ఓ వీడియో వదిలాడు అన్వేష్.  రూపాయి రాని ఇన్ స్టా గ్రామ్ ఉంటే ఏంటి పోతే ఏంటి.. నా రెండు చేతులు నా రెండు ఇన్ స్టా గ్రామ్ అకౌంట్స్, నా రెండు కాళ్లు రెండు యూట్యూబ్ ఛానెల్స్, నా బాడీ ఫేస్ బుక్. వీటన్నింటిని నడిపించేది నా తెలివైన బుర్ర.. ఎంతో మంది కుక్కలను నిద్ర లేకుండా చేస్తున్నా నా బుర్ర. ఇప్పుడు బత్తాయిలు అందరూ కలిసి ఓ చెయ్యి విరిచేశారు. అయితే ఏమైంది.. ఇంకో చెయ్యి ఉంది. రెండు కాళ్ళు ఉన్నాయి అంటూ ఓ వీడియో వదిలాడు. ఏది ఏమైనా నన్ను ఎవ్వరూ ఆపలేరు అంటూ అర్ధం వచ్చేలా ఓ ఆ వీడియో షేర్ చేశాడు అన్వేష్. ఇప్పుడు ఈ వీడియా మరోసారి హాట్ టాపిక్ గా మారింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *