మారుతోన్న జీవన విధానం, తీసుకుంటోన్న ఆహారంలో మార్పులు, కాలుష్యం కారణంగా ఇటీవల బట్టతల సమస్య బారిన పడుతోన్న వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. ఒకప్పుడు 50 ఏళ్లు మళ్లిన వారిలోనే ఈ సమస్య కనిపించేది కానీ ఇప్పుడు పాతికేళ్లు కూడా నిండకుండానే బట్టతల సమస్యతో బాధపడుతున్నారు. నీటి కాలుష్యం, వాయు కాలుష్యం, హెల్మెట్‌లను ధరించడం వంటి వాటి వల్ల వెంట్రుకలు రాలిపోతున్నాయి. దీంతో రకరకాల ట్రీట్‌మెంట్‌లు తీసుకుంటున్నారు.