బట్టతలకు విరుగుడు కనిపెట్టామన్నారు.. లచ్చలు లచ్చలు పోశాడు.. ఆ తర్వాత సీన్ ఇదే!

బట్టతలకు విరుగుడు కనిపెట్టామన్నారు.. లచ్చలు లచ్చలు పోశాడు.. ఆ తర్వాత సీన్ ఇదే!


బట్టతలకు విరుగుడు కనిపెట్టామన్నారు.. లచ్చలు లచ్చలు పోశాడు.. ఆ తర్వాత సీన్ ఇదే!

కొండ నాలుకకి మందేస్తే.. ఉన్న నాలుక ఊడిపోయినట్లుగా ఉంది కాకినాడలోని ఓ వ్యక్తి పరిస్థితి..! తలపై జుట్టు లేదన్న బాధతో ఓ హెయిర్‌ ప్లాంటేషన్‌ క్లినిక్‌ను సంప్రదిస్తే.. ఉన్న వెంట్రుకలూ తీసేసి బోడి గుండుతో పంపించేరని ఆవేదనకు గురయ్యాడు. చివరికి మోసపోయానని గ్రహించి, పోలీసులను ఆశ్రయించాడు. తనకు న్యాయం చేయాల్సిందిగా వేడుకుంటున్నాడు.

కాకినాడలోని VRS హెయిర్ క్రియేషన్స్‌ తనను నిండి ముంచిందని గోడువెళ్లబోసుకుంటున్నాడు బాధితుడు. హెయిర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చేయించేందుకు 98వేల రూపాయల ప్యాకేజీ తీసుకుంటే ఫలితం శూన్యం అని వాపోయాడు. 9నెలలుగా ట్రీట్‌మెంట్ చేస్తున్నారని.. ప్రతి ట్రిప్‌లో 3 నుంచి 4వేల రూపాయలు వసూలు చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు.

అసలేం జరుగుతోంది…! హెయిర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌కు ఇన్నిరోజుల సమయం తీసుకుంటారా.. అని నిలదీస్తే, హడావుడిగా ఒరిస్సా నుంచి బార్బర్లను తీసుకొచ్చి ఉన్న జుట్టును తొలగించి, గుండు కొట్టాడని కన్నీటి పర్యంతమయ్యాడు బాధితుడు. బీపీ, షుగర్ ఉండటం వల్ల ట్రీట్‌మెంట్‌ సాధ్యపడట్లేదని చేతులెత్తేశారంటూ మనోవేధనకు గురయ్యాడు. చివరికి కాకినాడ టూ టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో న్యాయం చేయాల్సిందిగా పోలీసులను వేడుకుంటున్నాడు బాధితుడు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *