ఆ సమయంలో ఫ్లాట్ ఫామ్ పై రైలు ఉండడంతో ప్రయాణికులంతా భయంతో కేకలు వేసుకుంటూ తలోదిక్కూ పరుగులెత్తారు. అయితే.. పూటుగా తాగిన ఆ మందుబాబు మాత్రం ఇదేమీ పట్టనట్లుగా సోయిలేకుండా అలాగే ఉండిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జార్ఖండ్ రిజిస్ట్రేషన్ ప్లేట్ ఉన్న కారు కంటోన్మెంట్ రైల్వే స్టేషన్‌లో కదులుతున్న రైలు దగ్గరికి దూసుకొచ్చు…కొన్ని అడుగుల దూరంలో ఆగింది. దీంతో అక్కడి ప్లాట్ ఫామ్ మీద ఉన్నవారంతా పరుగులు తీశారు. కాగా, రైల్వే పోలీసులు అతడిని కారు నుంచి కిందికి దించి.. విచారణ చేపట్టారు. అతడిని ఆర్మీలో పనిచేసే.. సందీప్ డాకాగా వారు గుర్తించారు. ప్రయాణికుల ప్రాణాలకు ముప్పు కలిగించడంతో పాటు నిబంధనలు అతిక్రమించినందుకు అతడిపై వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. వైద్య పరీక్షల్లో నిందితుడు మద్యం సేవించినట్లు నిర్ధారణ అయ్యింది. డాకాను అరెస్టు చేయడంతో పాటు అతని డ్రైవింగ్ లైసెన్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. క్యాబ్ డైరెక్ట్ టు ట్రైన్ సీట్ అని ఒకరు కామెంట్ చేయగా.. యూపీ రోజూ కొత్త పనులతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తుందని మరొకరు కామెంట్ చేశారు. మరికొంతమంది ఈ ఘటనను రైల్వే పోలీసుల నిర్లక్ష్యంగా ఆరోపిస్తున్నారు. కారు ఫ్లాట్ ఫామ్‌పైకి వచ్చేదాక పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బ్రొకోలీ తింటున్నారా.. అయితే ఇది తెలుసుకోండి