ఫుట్‌బాల్‌ ఆడుతున్న రోబోలు.. ఇక మేము ఏం ఆటలు ఆడాలి అంటున్న మనుషులు

ఫుట్‌బాల్‌ ఆడుతున్న రోబోలు.. ఇక మేము ఏం ఆటలు ఆడాలి అంటున్న మనుషులు


మనుషులే కాదు రోబోలు అదరగొట్టేలా ఫుట్‌ బాల్‌ ఆడగలవని నిరూపించారు చైనా పరిశోధకులు. ఇటీవల చైనా పురుషుల ఫుట్‌బాల్‌ జట్టు తన ఆటతీరుతో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయారు. అయితే మనుషులను పోలిన ఈ రోబోలు మాత్రం గురి చూసి మరీ గోల్‌ కొడుతుండటం చూసి పరిశోధకులే ఆశ్చర్యపోతున్నారు. రోబోలకున్న అడ్వాన్స్‌డ్‌ విజువల్‌ సెన్సార్ల సాయంతో బంతిని గుర్తించడంతో పాటు మైదానంలో తమ చురుకైన కదలికలతో అందర్నీ ఆకట్టుకున్నాయి. కిందపడినా మళ్లీ మనుషుల్లా పైకి లేచాయి. ఏఐ టెక్నాలజీ సహాయంతో ముందుకు కదలడం ఇలా ఒకటేమిటీ అన్ని రకాల ఫుట్‌బాల్‌ నైపుణ్యాల్ని ప్రదర్శించాయి. ఆటల్లో గాయపడిన రోబోలను స్ట్రెచర్ల సాయంతో సిబ్బంది బయటకు తీసుకెళ్లడం ఆటకే హైలెట్‌. త్వరలో జరిగే ప్రపంచ హ్యూమనాయిడ్‌ రోబోట్‌ పోటీలకు ప్రివ్యూగా శనివారం చైనా రాజధాని బీజింగ్‌లో ఈ పోటీలు నిర్వహించారు. బూస్టర్‌ రోబోటిక్స్‌ సంస్థ రూపొందించిన నాలుగు హ్యూమనాయిడ్‌ రోబోట్‌ జట్లు ఈ పోటీల్లో కనువిందు చేశాయి. భవిష్యత్తులో మనుషులు, రోబోలు కలిసి ఆడే పరిస్థితులు వచ్చినా ఆశ్చర్యపోనక్కరలేదేమో.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కొత్త టెక్నిక్‌తో చేపలుపడుతున్న గోదారోళ్లు.. కొత్త ట్రెండ్ సూపర్ అంటున్న నెటిజన్స్

లగ్జరీ కార్లున్నా ఆటోలో తిరుగుతున్న స్టార్ హీరోయిన్..

దీపికకు అరుదైన ఘనత.. ఈ ఫీట్ సాధించిన ఏకైక ఇండియన్ స్టార్ ఈమే

ప్రభాస్ కోసం రంగంలోకి కరీనా !! థియేటర్స్ ఊగిపోయేలా.. మాస్‌ మసాలా నూరుతున్న తమన్

Nithya Menen: ప్రభాస్‌ కారణంగా మానసికంగా కుంగిపోయా..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *