ఫిబ్రవరి 15 నుంచి బ్యాంక్‌ రూల్స్‌లో మార్పు

ఫిబ్రవరి 15 నుంచి బ్యాంక్‌ రూల్స్‌లో మార్పు


ఎస్‌బీఐ తన ఖాతాదారులకు షాకిచ్చింది. ఇప్పటి వరకు ఆన్‌లైన్ ద్వారా ఉచితంగా అందుబాటులో ఉన్న IMPS క్యాస్‌ ట్రాన్సఫర్‌ సేవలపై సర్వీస్ ఛార్జీలు వసూలు చేయాలని నిర్ణయించింది. ఈ కొత్త నిబంధనలు 2026, ఫిబ్రవరి 15 నుంచి అమలులోకి రానున్నాయి. సాధారణంగా అత్యవసర నగదు బదిలీల కోసం వినియోగించే IMPS సేవలపై బ్యాంక్ పరిమితులను విధించింది. దీని ప్రకారం.. ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ , యోనో యాప్ ద్వారా చేసే లావాదేవీలకు ఈ ఛార్జీలు వర్తిస్తాయి. రూ. 25,000 వరకు ఎటువంటి ఛార్జీలు ఉండవు. రూ.25,001 నుంచి రూ.1,00,000 వరకు రూ.2 ప్లస్ జీఎస్‌టీ, రూ.1,00,001 నుంచి రూ. 2,00,000 వరకు రూ.6 ప్లస్ జీఎస్‌టీ, రూ.2,00,001 నుంచి రూ.5,00,000 వరకు రూ.10 ప్లస్ జీఎస్‌టీ చార్జ చేయనున్నారు. రూ.25 వేల లోపు చేసే లావాదేవీలపై ఎటువంటి ఛార్జీలు విధించకపోవడం సామాన్య వినియోగదారులకు కొంత ఊరట కలిగించే అంశం. నేరుగా బ్యాంకు బ్రాంచ్‌కు వెళ్లి చేసే IMPS ఛార్జీలలో ఎటువంటి మార్పు లేదు. అవి పాత పద్ధతిలోనే రూ.2 నుంచి రూ.20 వరకు కొనసాగుతాయి. డిఫెన్స్, కేంద్ర ప్రభుత్వం, రైల్వే, పోలీసు సిబ్బందికి చెందిన శాలరీ అకౌంట్లకు, అలాగే కొన్ని ప్రత్యేక సేవింగ్స్ ఖాతాలకు మాత్రం ఈ ఛార్జీల నుంచి మినహాయింపు ఉంటుంది. డిజిటల్ పద్ధతిలో చేసే NEFT, RTGS లావాదేవీలు యథావిధిగా ఉచితంగానే కొనసాగుతాయని బ్యాంక్ స్పష్టం చేసింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నోట్లో పేలిన సెల్‌ఫోన్ బ్యాటరీ.. యువకుడు మృతి

సినిమా పేరుపై సాధువుల మండిపాటు.. పేరు మార్చాలని డిమాండ్

దేశవ్యాప్తంగా నిలిచిపోయిన ఓలా, ఉబర్ సేవలు.. కారణం

అద్దాల ట్రైన్‌లో అందమైన జర్నీ.. ఆకాశమంతా మీదే..! ఎక్కడంటే ??

టీజీ లాసెట్ నోటిఫికేషన్ విడుదల.. పూర్తి షెడ్యూల్ ఇదే



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *