ప్రేమంటే ఇదేరా !! పెళ్లయి అత్తారింటికి అక్క.. వెనకే 70 కి.మీ సైకిల్ తొక్కుతూ వెళ్లిన తమ్ముడు

ప్రేమంటే ఇదేరా !! పెళ్లయి అత్తారింటికి అక్క.. వెనకే 70 కి.మీ సైకిల్ తొక్కుతూ వెళ్లిన తమ్ముడు


రక్తసంబంధం విలువ రోజు రోజుకూ తగ్గిపోతున్న రోజుల్లో.. అక్కా తమ్ముడు మధ్య ఉండే స్వచ్ఛమైన ప్రేమకు నిదర్శనంగా కళ్లు చెమర్చే ఘటన జరిగింది. తన ప్రాణ సమానమైన అక్క.. కారులో అత్తవారింటికి వెళుతుంటే, ఎడబాటు తట్టుకోలేక తమ్ముడు అక్కవెంటే 70 కిలోమీటర్లు సైకిల్‌ తొక్కుకుంటూ వెళ్లాడు. పెళ్లి తర్వాత వధువు తన భర్తతో కలిసి అత్తవారింటికి వెళుతుంటే.. తల్లిదండ్రులు, తోబుట్టువులు, బంధువులు ఎంతగా ఎమోషన్ అవుతారో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఆ దృశ్యం చూస్తే ప్రతి ఒక్కరూ ఎంతో భావోద్వేగానికి గురవుతారు. కానీ, బిహార్ లో అంతకు మించిన భావోద్వేగ క్షణాలు కనిపించాయి. వివాహం అనంతరం అప్పగింతల తర్వాత నవ వధువు భర్తతో కలిసి కారులో బయలుదేరింది. తన అక్క విడిచి వెళ్లడం తట్టుకోలేకపోయిన తమ్ముడు, ఆమెను సాగనంపడానికి సైకిల్ పై బయలుదేరాడు. ఏదో కొద్ది దూరం అనుకుంటే పొరపాటే.. ఆమె ప్రయాణిస్తున్న కారు వెంటే దాదాపు 70 కిలోమీటర్ల వరకు ఏకధాటిగా సైకిల్ తొక్కాడు. ఈ ఘటన పూర్ణియా జిల్లా చంపానగర్‌లో జరిగింది. ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో చూసి నెటిజన్లు భావోద్వేగానికి లోనవుతున్నారు. ‘డబ్బు, ఆస్తుల కోసం గొడవపడే ఈ కాలంలో ఇలాంటి అనుబంధాలు ఉండటం నిజంగా గ్రేట్’ అని కొందరు, ‘ఆ తమ్ముడి ప్రేమ వెలకట్టలేం’ అని మరికొందరు, ‘దేవుడు మీ అక్కకు నీలాంటి మంచి తమ్ముడినిచ్చాడు’ అని ఒక నెటిజన్ కామెంట్ చేశారు. ప్రస్తుతం ఈ ఎమోషనల్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇండియా దెబ్బ.. పాక్ అబ్బా.. తొమ్మిది నెలలైనా తేరుకోలేదుగా

ఆగి ఉన్న కారులో మూడు మృతదేహాలు.. ఆత్మహత్యా ?? లేక హత్యా ??

పాక్ కు షాకిచ్చిన ట్రంప్ టీమ్‌ పీఓకేతో భారత మ్యాప్‌ సిద్ధం

పూనకంతో ఊగిపోతూ.. 6 నిమిషాల్లో 4 లీటర్ల నీళ్లు తాగిన నటి

బర్డ్ ఫ్లూ కలకలం.. ఆ జిల్లాలో హై అలర్ట్



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *