ప్రార్థనల కోసం ఉదయాన్నే గురుద్వారాకు వచ్చాడు.. 10సెకన్లలోనే దారుణం.. ఒళ్లు గగుర్పొడిచే సీన్..

ప్రార్థనల కోసం ఉదయాన్నే గురుద్వారాకు వచ్చాడు.. 10సెకన్లలోనే దారుణం.. ఒళ్లు గగుర్పొడిచే సీన్..


పంజాబ్‌ జలంధర్‌ సిటీలో ఆప్‌ సీనియర్‌ నేత లక్కీ ఒబెరాయ్‌ను దుండుగులు కాల్చి చంపిన ఘటన తీవ్ర కలకలం రేపింది. శుక్రవారం గురుద్వారాలో ప్రార్ధనల తరువాత బయటకు వచ్చిన లక్కీ ఒబరాయ్‌పై ఇద్దరు దుండగులు కాల్పులు జరిపారు. కారులో వెళ్తుండగా అతడిపై కాల్పులు జరిపారు. సంఘటనా స్థలంలోనే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు లవ్‌ ఒబెరాయ్‌. ఆప్‌ నేతను దుండగులు కాల్చి చంపిన ఘటన సీసీటీవీలో రికార్డయ్యింది.

లవ్‌ ఒబెరాయ్‌పై దుండగులు ఐదు రౌండ్లు కాల్పులు జరిపారని పోలీసులు తెలిపారు. అతి సమీపం నుంచి కాల్పులు జరపడంతో అతడు స్పాట్‌లో చనిపోయాడు. ఆసుప్రతికి తరలించే లోపే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. టూవీలర్‌పై వచ్చిన దుండగులు కాల్పులు జరిపారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో లక్కీ ఒబెయార్‌ భార్య ఆప్‌ అభ్యర్ధిగా పోటీ చేశారు. పాత కక్షల తోనే లవ్‌ ఒబెరాయ్‌ను హత్య చేసినట్టు అనుమానిస్తున్నారు.

పంజాబ్‌లో శాంతిభద్రతలు క్షీణించాయని, అందుకు ఈ ఘటన నిదర్శనమని ఆప్‌ నేతలు ఆరోపించారు. అధికార పార్టీ నేతలకే రక్షణ లేదని, సీఎం మాన్‌ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. జనవరిలో కూడా జర్నాల్‌సింగ్‌ అనే ఆప్‌ నేతను అమృత్‌సర్‌లో దుండగులు కాల్చి చంపారు.

సీసీటీవీ ఫుటేజ్ లో షాకింగ్ దృశ్యాలు..

జలంధర్‌లో తెల్లవారుజామున ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) నాయకుడిపై కాల్పులు జరిగాయి. గురుద్వారా నుండి వస్తుండగా లక్కీ ఒబెరాయ్ అనే నాయకుడి కారు వద్దకు ఒక వ్యక్తి వచ్చినట్లు CCTV ఫుటేజ్ చూపిస్తుంది. వచ్చి రాగానే.. థార్ కారు దగ్గర అతనిపై కాల్పులు జరిపాడు.. ఈ సమయంలో మహీంద్రా థార్ రాక్స్ కిటికీ అద్దాలు కూడా పగిలిపోయాయి. మొత్తం ఘటన దాదాపు 10 సెకన్లలో జరిగింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *