ప్రసవ వేదన భరించలేక గర్భిణి షాకింగ్‌ నిర్ణయం.. వామ్మో అలా ఎలా చేసావ్.. అమ్మా

ప్రసవ వేదన భరించలేక గర్భిణి షాకింగ్‌ నిర్ణయం.. వామ్మో అలా ఎలా చేసావ్.. అమ్మా


బిడ్డకు జన్మనివ్వడం అంటే పునర్జన్మ పొందడం. ఎందుకంటే ఆ ప్రసవవేదన, ఇతర సమస్యల వల్ల ఆమె బతుకుందో లేదో తెలియదు. ప్రస్తుతం వైద్య చికిత్సలు అందుబాటులోకి రావడం వల్ల ప్రసవాలు సుఖంగా జరిగిపోతున్నాయి. ఓ గర్భిణీ మహిళ మాత్రం ఆస్పత్రికి వెళ్లే వరకు కూడా పురిటి నొప్పులను భరించలేకపోయింది. దీంతో వంటింట్లో దొరికిన కత్తి తీసుకుని కడుపును కోసుకుంది. ఇంతటి భయానక పరిస్థితిలో కూడా ఆమె ఒక పండంటి ఆడబిడ్డకు జన్మనివ్వడం గమనార్హం. ఆమెకు తోడుగా భర్త లేడు. సాయం చేసే వారు దగ్గరలో లేరు. భరించలేని నొప్పుల మధ్య ఆ గర్భిణి తీసుకున్న నిర్ణయం అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. వంటింటి కత్తితో కడుపు కోసుకున్న స్థితిలో ఆమె బిడ్డకు జన్మనిచ్చింది. ఉత్తర ప్రదేశ్‌ నంద్వాల్ గ్రామస్తురాలు నాంకై నిండు నెలల గర్భిణీ. ఆరు నెలల క్రితమే ఆమె భర్త అనారోగ్యంతో కన్నుమూశాడు. గర్భవతిగా ఉన్న ఆమె ఒంటరిగా జీవించాల్సి వచ్చింది. గురువారం ఆమెకు అకస్మాత్తుగా ప్రసవ నొప్పులు మొదలయ్యాయి. చుట్టుపక్కల ఎవరూ లేకపోవడం, నొప్పుల తీవ్రత క్షణక్షణానికి పెరగడంతో ఆమె ఓపిక నశించింది. ఆ బాధను తట్టుకోలేక.. ఇంట్లోని ఓ కూరగాయలు కోసే కత్తి తీసుకుని తన పొత్తికడుపును కోసుకుంది. దీంతో నాంకై విపరీతంగా కేకలు వేసింది. పెద్ద ఎత్తున శబ్దాలు వినిపించడంతో చుట్టుపక్కల వారు ఆమె ఇంటికి చేరుకున్నారు. అంబులెన్సుకు ఫోన్ చేశారు. ఆపై ఆమెను కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. అక్కడ వైద్యుల పర్యవేక్షణలో ఆమె ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే కత్తితో కోసుకోవడం వల్ల ఆమెకు భారీగా రక్తస్రావమై పరిస్థితి విషమించింది. మెరుగైన వైద్యం కోసం ఆమెను లక్నోలోని ఉన్నత స్థాయి వైద్యశాలకు తరలించారు. ప్రస్తుతం నాంకై తల్లి నీతా ఆమె వెంట ఉండి వైద్య సేవలు అందేలా చూస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

చెత్తకుప్పలో రూ.15 లక్షల విలువైన నగలు.. ఊహించని ట్విస్ట్‌..

బాబోయ్‌.. సౌండ్ తగ్గించమనందుకు.. కత్తితో పొడిచి భర్తను చంపిన భార్య



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *