ప్రతిరోజూ స్నానం చేయడం ఇకపై తప్పనిసరి నియమం కాదు. చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, మనం స్నానం చేయడానికి సరైన మార్గాన్ని అవలంబించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇది మీ దినచర్య, చర్మ రకం, వాతావరణంపై ఆధారపడి ఉంటుంది. ఎక్కువగా స్నానం చేయడం వల్ల చర్మం సహజ రక్షణ దెబ్బతింటుంది. అమెరికాలోని హార్వర్డ్ విశ్వవిద్యాలయంతో సహా అనేక వైద్య సంస్థలు వారానికి 2 నుండి 3 సార్లు స్నానం చేయడం సరిపోతుందని చెప్పాయి. ముఖ్యంగా ఎక్కువ శారీరక శ్రమ చేయని లేదా చల్లని ప్రాంతాల్లో నివసించే వారికి ప్రతిరోజూ అవసరం లేదని చెబుతున్నారు.
ప్రతిరోజూ స్నానం చేయడం వల్ల చర్మంపై ఎలాంటి ప్రభావం ఉంటుంది?
రోజూ స్నానం చేయడం వల్ల మన చర్మంలోని సహజ నూనె పొర తగ్గుతుంది. ఈ పొర మన చర్మాన్ని బ్యాక్టీరియా, దుమ్ము, కాలుష్యం నుండి రక్షిస్తుంది. తరచుగా స్నానం చేయడం వల్ల ఈ పొర తగ్గుతుంది. దీంతో చర్మం పొడిబారడం, దురద, అలెర్జీలు వంటి సమస్యలను కలిగిస్తుంది. ముఖ్యంగా సున్నితమైన లేదా పొడి చర్మం ఉన్నవారు ప్రతిరోజూ సబ్బు లేదా కఠినమైన క్లెన్సర్‌లను వాడకుండా ఉండాలి.
ఇవి కూడా చదవండి
పరిశోధన, నిపుణుల అభిప్రాయం ఏం చెబుతుంది?
చాలా అధ్యయనాలు ఎక్కువగా స్నానం చేయడం వల్ల శరీర సూక్ష్మజీవుల సమతుల్యత కూడా దెబ్బతింటుందని చెబుతున్నాయి. ఇవి మన చర్మ ఆరోగ్యాన్ని కాపాడే సూక్ష్మజీవులు.
ప్రతిరోజూ స్నానం చేయడం ఎప్పుడు అవసరం?
మీరు వేడి, తేమతో కూడిన వాతావరణంలో నివసిస్తుంటే, వ్యాయామం చేస్తే, బయట పని చేస్తే లేదా ఎక్కువగా చెమట పడుతుంటే, మీరు ప్రతిరోజూ స్నానం చేయాలి. దీనితో పాటు, ఇన్ఫెక్షన్ లేదా చర్మపు చికాకును నివారించడానికి మీరు క్రమం తప్పకుండా శుభ్రపరచడం కూడా అవసరం. కానీ మీరు ప్రతిసారీ సబ్బు లేదా బాడీ వాష్ ఉపయోగించాలని దీని అర్థం కాదు. స్నానం చేయటం ద్వారా శరీరాన్ని శుభ్రం చేసుకోవాలంటే కేవలం నీటితో కూడా చేయవచ్చు అంటున్నారు.
ఎంత సేపు స్నానం చేయాలి?
అయితే, కొందరు చాలా ఎక్కువ సమయం పాటు స్నానం చేస్తుంటారు. నీటిలో ఎక్కువ సమయం గడపడం వల్ల చర్మంతోపాటు జుట్టు కూడా దెబ్బతింటుదని నిపుణులు చెబుతున్నారు. స్నానం చేసే సమయం సుమారు 3-5 నిమిషాల పాటు చేస్తే సరిపోతుందని సూచిస్తున్నారు. శరీరంలోని ప్రతీ ప్రదేశాన్ని రుద్దుతూ ఉండకుండా.. ముఖ్యంగా చంకలు, ముఖం లాంటి ప్రదేశాలపై దృష్టి పెట్టాలని చెబుతున్నారు. అలాగే, ప్రతి రోజూ తలకు షాంపూ పెట్టాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. చాలా రకాల వెంట్రుకలకు వారానికి రెండు, మూడు సార్లు పెడితే సరిపోతుందని సూచిస్తున్నారు.