ప్రతిరోజూ రాత్రి నిద్రపోయే ముందు పీనట్‌ బటర్‌ తింటే ఏమవుతుందో తెలుసా..?

ప్రతిరోజూ రాత్రి నిద్రపోయే ముందు పీనట్‌ బటర్‌ తింటే ఏమవుతుందో తెలుసా..?


పీనట్‌ బటర్‌ రుచికరంగా ఉంటుంది. ఇందులో విటమిన్‌ ఇ, బి3, బి6, బి9తో పాటు మెగ్నీషియం, కాపర్‌, మాంగనీస్‌, సెలీనియం వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. పీనట్‌ బటర్‌లో మెగ్నీషియం అధికంగా లభిస్తుంది. ఇది కండరాలను రిలాక్స్‌గా ఉంచుతుంది. దీంతో నిద్రపోవడానికి ముందు పీనట్ బటర్‌ తింటే బాడీ రిలాక్స్‌ అవుతుంది. పీనట్ బటర్‌లో ట్రిఫ్టోఫాన్‌ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది సెరటోనిన్‌కు పూర్వరూపం. ఇది గాఢ నిద్రను అందించడంలో సాయడపతుంది.

పెరిగిన చక్కెర స్థాయిలు మధ్య రాత్రిలో నిద్రను పాడు చేస్తాయి. పడుకునే ముందు పీనట్‌ బటర్‌ తింటే చక్కెర స్థాయిలు స్థిరంగా ఉంటాయి. దీని వల్ల నిద్రలో భంగం కలగదు. పీనట్ బటర్‌లో ట్రిఫ్టోఫాన్‌ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది సెరటోనిన్‌కు పూర్వరూపం. ఇది గాఢ నిద్రను అందించడంలో సాయడపతుంది. పడుకునే ముందు పీనట్‌ బటర్‌ తినడం వల్ల మధ్య రాత్రిలో ఆకలి ఉండదు. దీని వల్ల బరువు అదుపులో ఉంటుంది. నిద్రబాగా పడుతుంది.

పీనట్‌ బటర్‌లోని విటమిన్లు, మినరల్స్‌ కణాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. పీనట్‌ బటర్‌ తింటే ఇమ్యూనిటీ పెరుగుతుంది. చిన్న చిన్న ఇన్ఫెక్షన్ల నుంచి దూరంగా ఉండొచ్చు. రాత్రిపూట పీనట్‌ బటర్‌ తినడం కండలు బలంగా మారుతాయి. పీనట్‌ బటర్‌లోని ప్రోటీన్‌, ఆరోగ్యకరమైన కొవ్వులు కండరాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. రాత్రి పూట పీనట్‌ బటర్‌ తిని పడుకోవడం వల్ల తర్వాతి రోజూ ఉత్సాహంగా మేల్కోవచ్చు. మురుసటి రోజూ మొత్తం యాక్టివ్‌గా ఉండేందుకు అవకాశం లభిస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *