యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) అనేది EPFకి కంట్రిబ్యూట్ చేసే ప్రతి ఉద్యోగికి ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ( EPFO ) కేటాయించిన సంఖ్య. ఇది ఒక ప్రత్యేకమైన 12-అంకెల సంఖ్య, ఒక ఉద్యోగి ఎన్ని ఉద్యోగాలు మారినా ఈ UAN నెంబర్ మాత్రమే అస్సలు మారదు. మీరు వేరే కంపెనీకి వెళ్లినప్పుడు ఈ నెంబర్ ద్వారా ఈజీగా మీ పీఎఫ్ అకౌంట్‌ను మెర్జ్ చేసుకోవచ్చు. ఇలా మెర్జు చేసుకున్న తర్వాత మీరు మీ బ్యాలెన్స్‌ను చెక్ చేయడానికి, మీ పాస్‌బుక్‌ను డౌన్లోడ్ చేసుకోవడానికి, మీ KYC వివరాలను అప్డేట్ చేసుకోవడానికి ఈ నెంబర్ ఉపయోగపడుతుంది. అయితే మీరు దీన్ని మర్చిపోతే తిరిగి ఎలా పొందాలో చూద్దాం.
UAN నంబర్‌ను ఎలా తిరిగి పొందాలి?
- మీరు మీ UAN నంబర్‌ను మర్చిపోతే, దానిని తిరిగి పొందడానికి మీరు EPFO సభ్యుల e-Seva పోర్టల్‌ను సందర్శించాల్సి ఉంటుంది.
- ఇందుకోసం మీరు ముందుగా, EPFO వెబ్సైట్ వెళ్లి ముఖ్యమైన లింక్‌ల కింద ‘మీ UAN గురించి తెలుసుకోండి’ అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
- ఇప్పుడు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేసి క్యాప్చాను ఎంటర్ చేయండి.
- తర్వాత మీ మొబైల్ ఫోన్‌కు వచ్చిన OTPని ఎంటర్ చేయండి.
- ఇప్పుడు మీ పేరు, పుట్టిన తేదీ, పాన్/ఆధార్/మీ ఐడిని ఎంటర్ చేయండి.
- తర్వాత మీకు ‘షో మై UAN’ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి.
- అప్పుడు మీకు మీ UAN కనిపిస్తుంది.
UMANG యాప్ ద్వారా UAN నెంబర్ తెలుసుకోవడం ఎలా?
ఇవి కూడా చదవండి
- మీరు UMANG యాప్ ద్వారా కూడా UAN ను తెలుసుకోవచ్చు.
- UMANG యాప్ లేదా SMS ఉపయోగించి మీరు మర్చిపోయిన UAN ను ఎలా తిరిగి పొందవచ్చు.
- ఇందుకోసం మీరు ప్లే స్టోర్ నుంచి UMANG యాప్‌ను డౌన్లోడ్ చేసుకొండి.
- దాన్ని ఇన్స్టాల్ చేసి మీ మొబైల్ నెంబర్‌తో రిజిస్టర్ అవ్వండి
- తర్వాత యాప్ ఓపెన్ చేసి EPFO సర్వీసెస్‌కి వెళ్లండి
- అక్కడ మీ UAN గురించి తెలుసుకోండి’ అనే ఆప్షన్‌ను ఎంచుకొండి.
- అప్పుడు మీకుOTP వస్తుంది. దాన్ని ఎంటర్ చేయండి.
- మీరు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి 7738299899 (EPFOHO UAN KYA) కు SMS చేయండి
- కాసేపటి తర్వాత మీ మొబైల్‌కు UAN నెంబర్ మెసేజ్‌కు వస్తుంది.
EPFO పోర్టల్ నుండి PF డబ్బును ఎలా ఉపసంహరించుకోవాలి?
- పీఎఫ్ ఖాతా నుంచి మీరు మీ డబ్బును విత్‌డ్రా చేసుకునేందుకు మీరు EPFO పోర్టల్‌కి వెళ్లాలి.
- EPFO పోర్టల్ వెళ్లి మీ UAN, పాస్‌వర్డ్‌ని ఉపయోగించి లాగిన్ అవ్వండి.
- తర్వాత Manage పై క్లిక్ చేసి KYC సెక్షన్లో వెళ్లి Aadhaar, PAN, Bank వివరాలు కరెక్ట్‌గా ఉన్నాయో చూడండి.
అవసరమైతే అప్డేట్ చేయండి - తర్వాత ‘ఆన్లైన్ సర్వీసెస్’ ట్యాబ్ కింద ‘క్లెయిమ్ (ఫారమ్-31, 19, 10C, 10D)’ పై క్లిక్ చేయండి
- మీ గుర్తింపును ధృవీకరించడానికి UAN తో లింక్ చేయబడిన మీ బ్యాంక్ ఖాతా నంబర్ లాస్ట్ 4 అంకెలను ఎంటర్ చేసి, Verify పై క్లిక్ చేయండి.
- తర్వాత Undertaking/Declaration టిక్ చేసి Proceed for Online Claim క్లిక్ చేయండి.
- తర్వాత కింద క్లెయిమ్ రకాన్ని ఎంచుకోండి
- PF Advance (Form 31) → మీరు ఇప్పటికీ ఉద్యోగం చేస్తున్నట్లయితే పాక్షిక ఉపసంహరణ ఈ ఫామ్‌ను సెలెక్ట్ చేయండి.
- Only PF Withdrawal (Form 19) ఒక వేళ మీరు ఉద్యోగం మానేసి పూర్తి PFను విత్‌డ్రా చేసుకోవాలని అనుకుంటే ఈ పామ్‌పై క్లిక్ చేయండి.
- PF Pension Withdrawal (Form 10C) మీరు పెన్షన్ బెనిఫిట్ పొందాలి అనుకుంటే ఈ ఫామ్‌ను ఎంచుకోండి.
- తర్వాత మీరు ఎందుకు డబ్బులు విత్‌డ్రా చేస్తున్నారో కారణంపై సెలెక్ట్ చేయండి.
- తర్వాత Aadhaar లింక్ మొబైల్‌కి వచ్చే OTP ఎంటర్ చేసి, క్లెయిమ్‌ను సబ్మిట్ చేయండి.
- అంతే ఇక 4-6 రోజుల్లో మీ పీఎఫ్ అకౌంట్‌కు లింక్ అయి ఉన్న అకౌంట్లోకి అమౌంట్ యాడ్ అవుతుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.