నిమ్మకాయ నీటికి ఇదొక్కటి కలపండి..
మలబద్దకాన్ని నివారించేందుకు చాలా మంది నిమ్మకాయ నీరు తాగుతుంటారు. అయితే, ఇందులో ఒక పదార్థం చేర్చడం వల్ల మలబద్దకం సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నిమ్మకాయ నీరు పేగులను హైడ్రేట్ చేయడంతోపాటు సిట్రిక్ యాసిడ్‌ను విడుదల చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అయితే, మీరు తాగే నిమ్మకాయ నీటిలో కేవలం ఒక స్పూన్ చియా గింజలను కలిపి 10 నిమిషాలు నానబెట్టి తీసుకోవడం వల్ల అదనపు ప్రయోజనాలు కలుగుతాయి. చియా గింజలను నిమ్మకాయ నీటికి జోడించడం వల్ల పేగులకు, ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలున్నాయి.