ముల్లంగిలో విటమిన్ సీ, బీ6, ఐరన్, కాల్షియం, ఫైబర్, ఫోలిక్ యాసిడ్ సహా మరిన్ని పోషకాలు మెండుగా ఉంటాయి. దీని వల్ల ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది. ముల్లంగి తినడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఇందులోని ఆంథోసైనిన్లు, శోథ నిరోధక లక్షణాలు గుండె జబ్బులను నివారించడంలో సహాయపడతాయి. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను కూడా తగ్గిస్తుంది.
ముల్లంగిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల బరువు నియంత్రణలో ఉంటుంది. ఇందులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కేలరీలు తక్కువగా ఉంటాయి. ముల్లంగిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీన్ని పచ్చిగా తినడం వల్ల మూలవ్యాధి పైల్స్ పూర్తిగా నయమవుతుంది. ముల్లంగి తినడం వల్ల మధుమేహం కూడా నియంత్రణలో ఉంటుంది.
క్యాన్సర్ రిస్క్‌ను ముల్లంగి తగ్గించగలదు. దీన్ని రెగ్యులర్‌గా తీసుకుంటే కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే ప్రమాదం బాగా తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. క్యాన్సర్ కణాల పెరుగుదలను ఇది నిరోధించగలదని అంటున్నారు. గర్భిణీ స్త్రీలు దీన్ని తినడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. బరువు తగ్గడానికి సహాయపడతాయని చెబుతున్నారు.
ముల్లంగిలో ఉండే పొటాషియం..రక్తపోటును నియంత్రిస్తుంది. దీంతో బీపీ కంట్రోల్లో ఉంటుంది. ఇందులోని విటమిన్ సీ రోగ నిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. సీజనల్ ఇన్ఫెక్షన్లు, వ్యాధుల రిస్క్ ఎక్కువగా సీజన్లు వర్షాకాలం, చలికాలంలో ముల్లంగి తరచూ తింటూ ఉండాలని నిపుణులు చెబుతున్నారు.
బరువు తగ్గాలనుకునే వారికి కూడా ముల్లంగి మంచి మెడిసిన్ అంటున్నారు నిపుణులు. ఎందుకంటే..ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ముల్లంగిలో ఉండే ఫైబర్ జీర్ణక్రియకు తోడ్పడుతుంది. ఎక్కువ సమయం పాటు కడుపు నిండిన భావన కలిగిస్తుంది. దీంతో అతిగా తినకుండా ఉంటారు. మలబద్ధకం దరిచేరాకుండా చేస్తుంది.