స్మగ్లర్లు రూటు మార్చారు. కూటమి ప్రభుత్వం గంజాయి సాగుపై ఉక్కుపాదం మోపడంతో.. ఎండు గంజాయి రవాణా కష్టమని భావించి, ఏకంగా ‘లిక్విడ్ గంజాయి’తయారీ యూనిట్లనే ఏర్పాటు చేస్తున్నారు. ఆంధ్ర-ఒడిశా సరిహద్దు లో గుట్టుగా సాగుతున్న ఒక భారీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌ను చూసి పోలీసులే విస్తుపోయారు. అల్లూరి జిల్లా సీలేరులోని ఐస్‌గెడ్డ జంక్షన్ వద్ద ఫిబ్రవరి మొదటి వారంలో పోలీసులు తనిఖీలు జరిపారు. ఈక్రమంలో ఏడు లిక్విడ్ గంజాయి ప్యాకెట్లు పట్టుబడ్డాయి. ఏపీ, ఒడిశాకు చెందిన ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి విచారించగా, ఒడిశాలోని మల్కాన్‌గిరి జిల్లా ‘బోడపొదర్’లో ఉన్న తయారీ కేంద్రం వెలుగులోకి వచ్చింది. ఒడిశా పోలీసులు బోడపొదర్పై దాడులు చేయగా, అక్కడ ఒక కుటీర పరిశ్రమ తరహాలో గంజాయి ఆయిల్ తయారు చేస్తున్న కేంద్రం బయటపడింది. గ్యాస్ సిలిండర్లు, కంప్రెసర్లు, ప్రెషర్ కుక్కర్లు, డ్రమ్ములతో ఏర్పాటు చేసిన ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌ను చూసి పోలీసులు అవాక్కయ్యారు. సుమారు 50 కిలోల ఎండు గంజాయిని మరిగించి, కేవలం ఒక కిలో హాషిష్ ఆయిల్‌ను తీస్తున్నట్టు గుర్తించారు. ఈ దాడుల్లో 25 లక్షల విలువైన 2 లీటర్ల లిక్విడ్ గంజాయితో పాటు, తయారీకి సిద్ధంగా ఉంచిన 30 కిలోల ఎండు గంజాయిని, పరికరాలను సీజ్ చేశారు. ఏపీకి చెందిన ఇద్దరు సహా మొత్తం నలుగురిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇలాంటి అక్రమ కేంద్రాలపై కఠినంగా వ్యవహరిస్తామని మల్కాన్‌గిరి ఎస్పీ వినోద్ పాటిల్ హెచ్చరించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
డ్రై క్లీనర్ మంత్లీ ఇన్‌కం.. రూ.2 లక్షలు నెట్టింట వైరల్‌గా పోస్ట్!
గిన్నిస్ రికార్డు సృష్టించిన భారీ పాము: చూస్తే వెన్నులో వణుకు పుట్టాల్సిందే
నీళ్లా.. అని లైట్ తీసుకోకండి.. విషయం తెలిస్తే షాకే
అదృష్టం, ఆనందం కలిసి రావాలంటే ఇంట్లో ఈ మొక్కలు పెంచండి
శివపార్వతుల కల్యాణంలో సాక్షాత్కరించిన నాగరాజు