పెళ్లి వేడుకను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకోవడం ఆ వీడియోను నెట్టింట పోస్ట్ చేయడం చాలా మంది చేస్తున్నారు. ఓ పంజాబీ పెళ్లిలో వధువుపై బంధువులు నోట్ల వర్షం కురిపించారు. మన కరెన్సీతో పాటు డాలర్లు కూడా అందులో ఉన్నాయని, అది మొత్తం రూ. 8. 5 కోట్ల రూపాయలు అంటూ నెటిజన్లు వీడియోను తెగ వైరల్ చేస్తున్నారు. అయితే ఇది కేవలం ప్రచారమని వరుడి కుటుంబం తోసిపుచ్చింది. పంజాబ్‌లోని తరన్ తారన్ జిల్లాలో జరిగిన వివాహంలో వేదిక దగ్గర వధువు నిలబడి ఉండగా.. కుటుంబం ఆమెపై కరెన్సీ నోట్లను విసురుతున్న దృశ్యాలు వీడియోలో రికార్డయ్యాయి. ఫిబ్రవరి 14న జరిగిన ఈ వివాహ వేడుకలో కోట్ల రూపాయలను వధువుపై కుమ్మరించినట్టు వస్తున్న వార్తలపై వరుడి కుటుంబం స్పందించింది. అందులో ఎటువంటి నిజం లేదని ఖండించింది. సంగీత్‌లో సరదాగా కరెన్సీని వధువుపై విసిరినట్టు వరుడి సోదరుడు సికందర్ సింగ్ తెలిపారు. అయితే, సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్టు 8.5 కోట్ల రూపాయలు కాదని, కేవలం రూ. 2 లక్షల ఖరీదైన నోట్లను మాత్రమే కుమ్మరించినట్టు వివరణ ఇచ్చారు. తన సోదరుడు ఆస్ట్రేలియాలో ట్రక్కు వ్యాపారం నిర్వహిస్తున్నాడని చెప్పుకొచ్చారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తున్నవారిపై పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. మరోవైపు, ఈ వివాహ వేడుకను నిర్వహించిన ఈవెంట్ మేనేజర్ కూడా రూ 8.5 కోట్లు అనే ప్రచారం నిజం కాదన్నారు. అయితే, వధువుపై రూ.4 లక్షల విలువైన కరెన్సీ నోట్లను వెదజల్లినట్టు ఆయన చెప్పడం గమనార్హం. ఇందులో కొన్ని డాలర్లు కూడా ఉన్నట్టు తెలిపారు. వీడియోపై నెటిజన్లు స్పందిస్తున్నారు. కొందరు విలాసవంతమైన ఈ పెళ్లి వేడుకను సమర్ధిస్తే… మరికొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగిన సందర్భాలు ఉన్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తను కూర్చున్న కొమ్మనే నరుక్కున్నాడు.. చివరికి..
రైతు ఇంట సిరులు కురిపిస్తున్న పంట !! అధిక దిగుబడితో సంతోషం
Goli Soda: సింగరేణి కార్మికుల ఆరోగ్య రహస్యం.. అసలుసిసలు గోలీ సోడా చేసే మేలు తెలుసా ??
మోగనున్న పెళ్లి బాజాలు.. అత్యంత శుభ ముహూర్తాలు ఇవే
ప్రసవ వేదన భరించలేక గర్భిణి షాకింగ్ నిర్ణయం.. వామ్మో అలా ఎలా చేసావ్.. అమ్మా