పెళ్లికి కుటుంబ సమేతంగా విచ్చేసిన రారాజు.. అతిథులు భయంతో..

పెళ్లికి కుటుంబ సమేతంగా విచ్చేసిన రారాజు.. అతిథులు భయంతో..


వివాహ వేడుక అంటే బంధుమిత్రులతో కోలాహలంగా ఉంటుంది. చుట్టాలు, పక్కాలు, స్నేహితులు… దూరం.. దగ్గర అని చూడకుండా అందరినీ ఆహ్వానిస్తారు. అందరూ కుటుంబ సమేతంగా పెళ్లికి హాజరవుతారు. ఇక పెళ్లిలో విందుకు ఉండే ప్రత్యేకతే వేరు. రకరకాల పిండివంటలతో ప్లేటు నిండిపోతుంది. అలాంటి పెళ్లి వేడుకకు ఎవరూ ఊహించని అతిథి కుటుంబ సమేతంగా విచ్చేశారు. అడవికి రాజైన సింహం, తన కుటుంబంతో కలిసి విందు ప్రాంగణంలో ప్రత్యక్షమవ్వడంతో అతిథులంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. గుజరాత్‌లోని జునాగఢ్ నగర శివారులో ఒక వివాహ వేడుక అట్టహాసంగా జరిగింది. వేడుక ముగిసి, అతిథులంతా వెళ్ళిపోతున్న సమయంలో సమీపంలోని గిర్ అడవుల నుంచి ఒక సింహం, తన భార్య, పిల్లలతో కలిసి విందు జరిగిన ప్రాంతానికి చేరుకుంది. అక్కడ అమర్చిన డైనింగ్ టేబుళ్లు, మిగిలిన ఆహార పదార్థాలను చూసి ఆ సింహాల కుటుంబం ఆసక్తిగా ఆ ప్రాంగణమంతా కలియతిరిగింది. అయితే, అక్కడ సింహాలకు అనుకూలమైన మాంసాహార విందు అందుబాటులో లేకపోవడంతో, ఆ ‘రాయల్ ఫ్యామిలీ’ కాసేపు అక్కడే అటూ ఇటూ తచ్చాడి నిరాశతో ఏమీ దొరక్క నిరాశతో తిరిగి వెళ్లిపోయింది. ఆ సమయంలో అక్కడ ఉన్న కొందరు అతిథులు ఈ దృశ్యాన్ని చూసి భయాందోళనకు గురైనప్పటికీ, సింహాలు ఎవరికీ ఎటువంటి హాని చేయకుండానే ప్రశాంతంగా అడవిలోకి వెళ్లిపోయాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు వెంటనే రంగంలోకి దిగారు. గిర్ పరిసర ప్రాంతాల్లో సింహాలు జనారణ్యంలోకి రాకుండా నిఘా ఏర్పాటు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. “మా పెళ్లికి సాక్షాత్తూ అడవి రాజే అతిథిగా వచ్చాడు” అంటూ స్థానికులు ఆసక్తిగా చర్చించుకున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రైతును పెళ్ళాడితే రూ.10 లక్షలు.. అంతే కాకుండా

విద్యార్థులపై హెడ్ మాస్టర్ ప్రతాపం.. విచక్షణ లేకుండా అలా ఎలా చేశారు సర్

ఎన్నో పాములను పట్టి ఎందరినో కాపాడాడు.. చివరికి..

జబర్దస్త్ నటుడికి దారుణ అనుభవం.. లేడీ అనుకుని పొలాల్లోకి లాక్కెళ్లి మరీ

అద్భుతం.. పెన్సిల్ మొనపై శివయ్య రూపం.. రికార్డుల రారాజు



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *