పెళ్లికాని ప్రసాదులూ గెట్ రెడీ.. మూఢం ముగిసింది..! భాజాలు మోగే టైమొచ్చేసింది..!

పెళ్లికాని ప్రసాదులూ గెట్ రెడీ.. మూఢం ముగిసింది..! భాజాలు మోగే టైమొచ్చేసింది..!


పెళ్లికాని ప్రసాదులూ గెట్ రెడీ.. మూఢం ముగిసింది..! భాజాలు మోగే టైమొచ్చేసింది..!

గత కొంత కాలంగా శుభమూహూర్తాలు లేక పెళ్లిళ్లు వాయిదా వేసుకున్నవారికి శుభవార్త. ఎందుకంటే మూఢం పోయి శుభకార్యాలు చేసుకునే టైమొచ్చింది. సాధారణంగా మాఘ మాసమంటేనే పెళ్లిళ్ల సందడి గుర్తుకు వస్తుంది. కానీ ఈసారి మాత్రం శుక్ర మూఢమి కారణంగా మాఘ మాసంలో వివాహాలకు విరామం ఏర్పడింది. గత మూడు నెలలుగా నిలిచిపోయిన శుభకార్యాలు ఇప్పుడు మళ్లీ ఊపందుకోబోతున్నాయి. పెళ్లిళ్లతోపాటు ఇతర శుభాకార్యాలు కూడా ఎలాంటి ఆటంకం లేకుండా జరుపుకోవచ్చు. మరి శుక్ర మూఢమి అంటే ఏమిటి? అది ఎప్పుడు ముగుస్తోంది? శుభ ముహూర్తాలు ఎప్పటి నుంచి ప్రారంభమవుతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

అసలేంటి శుక్ర మూఢమి?

వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నవగ్రహాల్లో శుక్రుడు వివాహం, దాంపత్య సౌఖ్యం, ఐశ్వర్యం, సుఖసంతోషాలకు కారకుడిగా భావించబడుతాడు. గ్రహ గమనంలో శుక్రుడు సూర్యునికి అత్యంత సమీపంగా వచ్చినప్పుడు సూర్యుని కాంతి ప్రభావంతో శుక్రుడు అస్తమయ స్థితిలోకి వెళ్తాడు. ఈ స్థితినే శుక్ర మౌఢ్యం లేదా శుక్ర మూఢమి అంటారు. ఈ కాలంలో వివాహాలు, గృహప్రవేశాలు, ఉపనయనాలు వంటి శుభకార్యాలు చేయడం శాస్త్రోక్తంగా అనుకూలం కాదని జ్యోతిష్యులు సూచిస్తారు.

శుక్ర మూఢమి ఎప్పుడు ముగుస్తోంది?

ఫిబ్రవరి 17, మంగళవారం నాటితో శుక్ర మూఢమి పూర్తవుతోంది. ఆ తర్వాత శుక్రుడు అస్తమయ స్థితి నుంచి బయటపడి మళ్లీ శుభప్రద స్థితికి వస్తాడు. దీంతో వివాహాది శుభకార్యాలకు అనుకూలమైన ముహూర్తాలు లభించనున్నాయి.

శుభ ముహూర్తాలు ఎప్పటి నుంచి?

ఫిబ్రవరి 18, బుధవారం నుంచి వివాహాలకు శుభ ముహూర్తాలు ప్రారంభమవుతాయి. ఇక్కడి నుంచి వివాహాలు, గృహప్రవేశాలు, ఉపనయనాలు వంటి కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించుకోవచ్చని పండితులు చెబుతున్నారు.

ఎప్పటి వరకు ఈ అవకాశాలు?

ఫిబ్రవరి 18 నుంచి మే 9 వరకు వివాహ ముహూర్తాలు అందుబాటులో ఉంటాయి. అనంతరం మే 17 నుంచి అధిక మాసం ప్రారంభమవడంతో మళ్లీ శుభకార్యాలకు విరామం ఏర్పడే అవకాశముంది. ఈ ఏడాది వివాహం చేసుకోవాలనుకునే వారు ఈ సమయాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రణాళికలు సిద్ధం చేసుకోవడం మంచిది.

గుర్తుంచుకోవాల్సిన విషయం

శుక్ర మూఢమి ముగిసిందని తొందరపడకుండా, వధూవరుల వ్యక్తిగత జాతకాలను పరిశీలించి, అనుకూలమైన ముహూర్తాన్ని నిర్ణయించుకోవడం శ్రేయస్కరం. అలాగే గృహప్రవేశం వంటి కార్యక్రమాల విషయంలో ఇంటి యజమాని జాతకబలాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి.

ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న శుభ సమయం వచ్చేసింది. వివాహం కోసం సిద్ధంగా ఉన్నవారు, కొత్త ఇంట్లో అడుగుపెట్టాలనుకునే వారు శాస్త్రోక్తంగా ముహూర్తం నిర్ణయించుకుని కొత్త జీవితానికి శ్రీకారం చుట్టండి. ఇక మీకు అంతా మంచే జరుగుతుంది.

(Disclaimer: ఈ వార్తలోని సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు అందించడం జరిగింది. దీనిని సంస్థ ధృవీకరించదు.)



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *