స్టార్ హీరో సూర్య రీసెంట్ గా రెట్రో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలైంది. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ప్రభావం చూపలేదు. ఈ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్ గా నటించింది. కాగా సూర్య గురించి ఆయన క్రేజ్ గురించి అందరికి తెలిసిందే. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ సపరేట్ స్టైల్ ను క్రియేట్ చేసుకున్నారు. సూర్యకు తెలుగులోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సూర్య తన కెరీర్ లో ఎన్నో వైవిధ్యమైన సినిమాలు చేసి విజయాలను అందుకున్నారు. గజినీ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యారు.
ఇది కూడా చదవండి :ఇదెక్కడి మేకోవర్ మావ..! అల్లుఅర్జున్ వరుడు హీరోయిన్ గుర్తుందా.? ఇప్పుడు సినిమాలు మానేసి
సూర్య నటించిన అన్ని సినిమాలు దాదాపు తెలుగులోనూ రిలీజ్ అయ్యాయి. ఇక సూర్య సతీమణి జ్యోతిక గురించి కూడా అందరికి తెలిసిందే.. ఆమె కూడా హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించి మెప్పించింది. అగరం అనే ఫౌండేషన్ నెలకొల్పి సూర్య చేస్తున్న మంచి పనుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఫౌండేషన్ ద్వారా వేలాది మందిని ఉచితంగ చదివిస్తున్నాడీ స్టార్ హీరో. పేదలు, అనాథలను ఎంపిక చేసి వారికి కేజీ నుంచి పీజీ వరకు ఉచితంగా విద్యను అందిస్తున్నాడు సూర్య. ఇందు కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాడు. అగరం ఫౌండేషన్ స్కూల్ కోసం తమ ఇంటినే ఉదారంగా ఇచ్చేసిన గొప్ప మనసు సూర్యది.
ఇవి కూడా చదవండి
ఇది కూడా చదవండి : ఛీ ఛీ.. ఇదేం సినిమారా బాబు..! వయసులో ఉన్న భార్య, ముసలి భర్త.. మధ్యలో మరో వ్యక్తి
ఇటీవలే ఈ సంస్థ 15వ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు. అగరం ఫౌండేషన్ ప్రారంభమై 15 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా చెన్నైలో ఆదివారం సాయంత్రం ఒక గ్రాండ్ ఈవెంట్ నిర్వహించారు. సూర్యతో పాటు అతని భార్య జ్యోతిక, సోదరుడు కార్తీ, కమల్ హాసన్, డైరెక్టర్ వెట్రిమారన్ తదితరులు ఈ వేడుకకు హాజరయ్యారు. ఈ ఈవెంట్ లో ఓ యువతి మాట్లాడుతూ అగరం ఫౌండేషన్ ద్వారా తన జీవితం మారిపోయిందని తెలిపింది. అలాగే ఆమె మాట్లాడుతూ.. నా పేరు జయప్రియ.. నేను ఇన్ఫోసిస్‌లో జాబ్ చేస్తున్నా.. మేము ఇప్పుడు సంతోషంగా ఉన్నాం.. కానీ ఒకప్పుడు మేము పేదరికంలో జీవించాం.. మాది నిరుపేదకుటుంబం. మా తండ్రి తాగుడికి బానిసయ్యాడు. మేము ఓ చిన్న గుడిసెలో జీవించేవాళ్లం. ఇంట్లో రోజూ పాములు వస్తూ ఉంటాయి. నాకు చదువు అంటే చాలా ఇష్టం.. పేదరికంలోనే నేను 12వ తరగతిలో టాపర్ గా నిలిచాను. మా మేడం అదే సమయంలో అగరం ఫౌండేషన్ సాయం చేస్తారు అని తెలిపారు. అలా నేను అగరం ఫౌండేషన్ ను కలిశాను. అప్పటి నుంచి మా జీవితం మారిపోయింది. అప్పుడు నాకున్న ఏకైక కల సొంతిల్లు. నేను సంపాదించిన డబ్బుతో మంచి ఇల్లు కట్టాలి. అందులో అమ్మానాన్న ప్రశాంతంగా నిద్రించాలి. ఫైనల్ గా నా కల నిజమైంది. ఒకటి కాదు రెండు ఇళ్లు కట్టాను. దీనంతటికీ కారణం అగరం ఫౌండేషన్. ఆడపిల్లకు చదువెందుకు అని అందరూ అంటారు.. కానీ ఆడపిల్లలను చదివించండి.. చదువుతో ఏదైనా సాధించవచ్చు అంటూ చెప్పుకొచ్చింది. ఆమె ఎమోషనల్ కామెంట్స్ తో సూర్య కన్నీళ్లు పెట్టుకున్నాడు.
ఇది కూడా చదవండి : అప్పట్లో ఊపేసిన హీరోయిన్.. అందరితో నటించింది.. కానీ నాగార్జునను మాత్రం రిజెక్ట్ చేసింది
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.