అక్కడి ఓ స్లమ్ ఏరియాలో ఓ అద్దె ఇంటిలో బతుకు సాగిస్తున్నాడు.అయితే.. నిరుడు జూన్‌లో అతడు ఉండే ఇంటికి పక్కనే నివసించే ఓ మహిళ అనారోగ్యానికి గురికావడంతో.. రాజేశ్ మానవతా దృక్పథంతో ఆమెను దగ్గరలోని ఒక ఆసుపత్రిలో చేర్పించాడు. అయితే, అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. దీంతో పోలీసులు రాజేశ్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణ సమయంలో రాజేశ్ భయపడుతూ సమాధానాలు చెప్పడంతో అతడే ఆమెను.. హత్య చేసి ఉంటాడని భావించి, కేసు పెట్టి, కోర్టులో హాజరు పరచగా.. కోర్టు అతడికి జైలు శిక్ష విధించింది. రాజేశ్‌ను అరెస్ట్ చేసిన 9 రోజుల వరకు పోలీసులు అతని కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వలేదు. నిరుపేద అయిన రాజేశ్ తరపున వాదించేందుకు ఏ లాయరూ ముందుకు రాకపోవటంతో.. అతడి వాదన వినిపించేందుకు కోర్టు ఒక ప్రభుత్వ న్యాయవాదిని కేటాయించింది. అతడు రాజేశ్ నుంచి అన్ని వివరాలు రాబట్టే క్రమంలో ఆమె.. అనారోగ్యంతో చనిపోయిందనే మెడికల్ రిపోర్టును గమనించాడు. అయితే..పోస్టుమార్టం రిపోర్టులో ఆమె గొంతు కోయటం వల్ల మరణించినట్లుగా ఉందని కూడా గమనించిన ఆ లాయర్.. ఈ రెండు రిపోర్టుల మీద ఫోకస్ పెట్టారు. చివరికి.. పోలీసులు, పోస్టుమార్టం సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని నిర్ధారించుకుని.. కోర్టుకు ఇదే విషయాన్ని ఆధారాలతో వివరించి.. రాజేశ్ నిర్దోషి అని వాదించాడు. సాక్షాలను పరిశీలించిన మీదట.. కోర్టు రాజేశ్ నిర్దోషి అని ప్రకటించి..అతడి విడుదలకు పోలీసులను ఆదేశించింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆఫీస్ లో మీటింగ్ అయ్యింది.. కట్ చేస్తే బిల్డింగ్ పైనుంచి దూకేసిన టెకీ
కంటి చూపుతోనే పేమెంట్స్..! UPI కొత్త ఫీచర్..