
అరటిలో మంచి మొత్తంలో జీర్ణానికి మేలు చేసే పీచుపదార్థాలు ఉండటం వల్ల ఇది జీర్ణవ్యవస్థకు ఎంతో మేలు చేస్తుంది. పచ్చి అరటిలో ఉండే రెసిస్టెంట్ స్టార్చ్ అనే గుణం ప్రీబయోటిక్ లా పనిచేస్తుంది. ఇది ప్రేగులలో మంచి బ్యాక్టీరియా పెరగడానికి సహాయపడుతుంది. ఇది జీర్ణశక్తిని మెరుగుపరచి మలబద్ధకాన్ని తగ్గించడంలో ఉపయోగపడుతుంది.
చిలకడదుంపలో అధికంగా పీచుపదార్థాలు ఉంటాయి. ఇవి ప్రేగులను శుభ్రంగా ఉంచుతూ మంచి బ్యాక్టీరియా పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. చిలకడదుంపలను పిల్లలకు వేపి లేదా ఉడకబెట్టి ఇవ్వడం ద్వారా వారి జీర్ణవ్యవస్థకు మేలు చేస్తుంది. ఇది శరీరానికి శక్తిని అందించడంతోపాటు రోగనిరోధక శక్తిని కూడా మెరుగుపరుస్తుంది.
ఓట్స్ లో ఉండే బీటా గ్లూకాన్ అనే పీచుపదార్థం జీర్ణవ్యవస్థకు ఎంతో మేలు చేస్తుంది. ఇది ప్రేగులలో ఉన్న మంచి బ్యాక్టీరియాను పోషించి వ్యర్థ పదార్థాలను తొలగించడానికి సహాయపడుతుంది. ఓట్స్ ను ఉదయాన్నే అల్పాహారంగా లేదా ఉడకబెట్టిన విధంగా పిల్లల ఆహారంలో చేర్చడం ఉత్తమం.
పెరుగు మంచి ప్రోబయోటిక్. ఇందులో లాక్టోబాసిలస్ వంటి మంచి బ్యాక్టీరియా ఉంటాయి. ఇవి ప్రేగుల ఆరోగ్యాన్ని సమతుల్యంగా ఉంచుతాయి. ప్రాసెస్ చేసిన లేదా చక్కెర కలిపిన పెరుగును కాకుండా.. స్వచ్ఛమైన పెరుగు ఉపయోగించాలి. పెరుగు ద్వారా జీర్ణవ్యవస్థ బాగా పనిచేస్తుంది. అదే విధంగా వ్యాధులపై పోరాడే శక్తిని కూడా పెంచుతుంది.
స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ లాంటి బెర్రీలు యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్లు అధికంగా ఉండే పండ్లు. ఇవి శరీరాన్ని శుభ్రపరచడంలో సహాయపడతాయి. ప్రేగుల ఆరోగ్యం బాగుండాలంటే ఫైబర్ అవసరం. దీనికి బెర్రీలు ఎంతో మేలు చేస్తాయి. ఇవి మలబద్ధకం రాకుండా నివారించి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. వీటిని స్నాక్స్ గా పిల్లలకు ఇవ్వవచ్చు.
ఈ ఆహారాలను పిల్లల రోజువారీ ఆహారంలో చేర్చడం వల్ల శరీరానికి అనేక లాభాలు కలుగుతాయి. చక్కెర కలిపిన ప్రాసెస్ చేసిన ఆహారాలను తగ్గించి.. ఈ సహజమైన పదార్థాలను ప్రోత్సహించడం ద్వారా మీ పిల్లల ఆరోగ్యాన్ని మరింత బలంగా తీర్చిదిద్దవచ్చు.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)