పాపికొండల విహార యాత్రలో ఒక్కసారిగా కలకలం.. ఒడ్డున ప్రత్యక్షమైన భారీ మొసళ్ళు

పాపికొండల విహార యాత్రలో ఒక్కసారిగా కలకలం.. ఒడ్డున ప్రత్యక్షమైన భారీ మొసళ్ళు


ప్రసిద్ధ పర్యాటక ప్రాంతమైన పాపికొండల విహారయాత్రలో ఒక్కసారిగా కలకలం రేగింది. పోలవరం జిల్లా వి.ఆర్.పురం మండలం పోచవరం వద్ద గోదావరి నది ఒడ్డున మొసళ్లు ప్రత్యక్షం కావడంతో పర్యాటకులు భయాందోళనకు గురయ్యారు. ఫిబ్రవరి 7 శనివారం ఉదయం బోటింగ్ పాయింట్ వద్ద పర్యాటకులు సిద్ధమవుతుండగా, నది ఒడ్డున రెండు మొసళ్లు సేదతీరుతూ కనిపించాయి. యాత్రికులను చూసిన వెంటనే ఒక మొసలి నీటిలోకి వెళ్ళిపోగా, మరొకటి అక్కడే ఉండిపోయింది. దీంతో అప్రమత్తమైన స్థానికులు, పర్యాటకుల రక్షణ దృష్ట్యా తాళ్లతో ఆ మొసలిని సురక్షితంగా మళ్ళీ నీటిలోకి పంపించివేశారు. సాధారణంగా ఈ ప్రాంతంలో మొసళ్లు కనిపించడం అరుదు. అయితే, పాపికొండ నేషనల్ పార్క్ పరిధిలో గోదావరి నది అత్యంత లోతుగా ఉండటం వల్ల మొసళ్ల సంచారం ఉండే అవకాశం ఉందని అటవీ శాఖ అధికారులు తెలిపారు. నది ఒడ్డున ఫోటోలు దిగేటప్పుడు, నీటిలోకి దిగేటప్పుడు పర్యాటకులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. బోటింగ్ పాయింట్ల వద్ద పర్యవేక్షణ పెంచాలని యాత్రికులు కోరుతున్నారు. ప్రకృతి అందాలను ఆస్వాదించడానికి వచ్చే పర్యాటకులు ఈ పరిణామంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అధికారులు పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

విజయం సాధించాలని గణనాథుడిని ప్రార్థించిన టీమిండియా

మేడారం హుండీలో చిత్ర విచిత్రమైన కోరికలు.. చదివి షాకవుతున్న సిబ్బంది

ఇక 27 భాషల్లో యూట్యూబ్‌ వీడియోలు

బెర్త్ దొరకని RAC ప్రయాణికులకు.. కొంత డబ్బు వాపస్!

అమ్మో మళ్ళీ వచ్చిన డేంజర్ వైరస్‌.. చెన్నై కాకుల మరణాలు, మహమ్మారి భయం



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *